అవును.. అర్జున్ ఆ యువతిని గదిలోకి తీసుకురమ్మన్నారు..

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (12:29 IST)
మీ టూ ఉద్యమం ఊపందుకున్న వేళ... దక్షిణాది యాక్షన్ కింగ్ అర్జున్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాదికి చెందిన భాషల్లో నటించి మంచి పేరు కొట్టేసిన అర్జున్‌పై హీరోయిన్ శృతి హరిహరన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా, తన వీపుపై చేయి వేసి, తనను గట్టిగా హత్తుకున్నారని ఆమె ఆరోపించింది. 
 
ఈ నేపథ్యంలో, అర్జున్ అభిమానుల నుంచి ఆమెకు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. అయితే శృతి హరిహరన్‌కు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు తెలిపాడు. శృతికి మద్దతివ్వాలని.. అలాగే మీ టూ వేధింపులకు గురైన మహిళలకు తన వైపు నుంచి మద్దతు లభిస్తుందని ప్రకాశ్ రాజ్ చెప్పాడు. 
 
ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు అర్జున్‌‌పై మరో నటి లైంగిక ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా వేరే యువతిని తన గదిలోకి తీసుకురమ్మని తనతో అర్జున్ చెప్పారని ఆమె వెల్లడించింది. ఆర్టిస్టులను సప్లయ్ చేసే వ్యక్తికి కూడా డబ్బు ఇచ్చి అమ్మాయిలను తెప్పించుకునేవారని చెప్పింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో అర్జున్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం