Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంతగా ప్రతిఘటించినా ఆ మానవమృగాన్ని ఆపలేక పోయా...

ఎంతగా ప్రతిఘటించినా ఆ మానవమృగాన్ని ఆపలేక పోయా...
, ఆదివారం, 21 అక్టోబరు 2018 (09:23 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కఠువాలో కామాంధుల చేతుల్లో నలిగిపోయిన చిన్నారి అసిఫాకు న్యాయం జరగాలని నినదించిన వ్యక్తి తాలిబ్ హుస్సేన్. ఆ తర్వాత కఠువా నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేసి ర్యాలీలు తీసి ఆందోళనలు నిర్వహించాడు. దీంతో అతని పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. పైగా, సోషల్ మీడియాలో అతన్ని ఫాలోయర్ల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరింది.
 
ఈ నేపథ్యంలో అతని గురించిన పచ్చినిజం ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. అతనో కర్కోటకుడనీ, పెద్ద రేపిస్టనీ తాజాగా తెలిసింది. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిని వేధించి వేటాడి చివరకు పాశవికంగా అత్యాచారం చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఆ బాధితురాలు స్వయంగా ఫస్ట్‌పోస్ట్‌ అనే వెబ్‌సైట్‌లో రాసిన కథనంలో వివరించింది. 
 
కఠువా ఉదంతం తర్వాత జమ్మూకు చెందిన తాలిబ్‌ను అనేక విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలు ఆహ్వానించాయి. 'విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేసిన ఆ మానవ మృగం ఓసారి ఢిల్లీ వచ్చి తనను కార్లో ఎక్కించుకుని బాట్లా ప్రాంతంలోని ఓ ఇంట్లో రేప్‌ చేశాడు. నేనెంత ప్రతిఘటించినా అతని మృగతనాన్ని ఆపలేకపోయాను' అని ఆమె అందులో రాసింది. 
 
అంతేకాకుండా, తాలిబ్‌ ఇప్పటికే తన మరదల్ని రేప్‌ చేసిన ఘటనలో నిందితుడనీ, ఆయన భార్య వేసిన గృహహింస కేసును కూడా ఎదుర్కొంటున్నాడనీ ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వెల్లడించారు. గతంలోనూ అతను లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటి దృష్ట్యా అతని కేసును ఇక వాదించరాదని నిశ్చయించుకున్నట్టు ఇందిరా జైసింగ్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ తొలి జాబితా ఇదేనా?