Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి బాలీవుడ్‌కు ఎందుకు దూరంగా వున్నారు? మెగాస్టార్ ఏం చెప్పారు?

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (18:51 IST)
ముంబైలో గ్రాండ్‌గా జరిగిన సైరా నరసింహారెడ్డి టీజర్ లాంచ్‌లో అక్కడి మీడియా టీమ్‌ను ప్రశ్నల వర్షంలో ముంచెత్తి కావలసిన సమాధానాలను రాబట్టుకుంది. ఈ సందర్భంగా, ప్రతినిధులు చిరుని ఇంత కాలం బాలీవుడ్‌కు దూరంగా ఎందుకు ఉన్నారు అని అడిగారు. వారు అడగడానికి కారణం లేకపోలేదు. చిరు చేసిన చివరి హిందీ స్ట్రెయిట్ మూవీ ది జెంటిల్ మెన్. ఇది 1994లో విడుదలైంది. 
 
అంతకు ముందు ఆజ్ కా గూండా రాజ్, ప్రతిబంద్‌లు కమర్షియల్ సూపర్ సక్సెస్‌ని అందుకుని కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవాలు కూడా జరుపుకున్నాయి. ఆ టైంలో చిరంజీవి ఇకపై రెగ్యులర్‌గా హిందీ సినిమాలు చేస్తారనే టాక్ కూడా పత్రికల్లో వచ్చేది. కానీ చిరు ఆ తర్వాత మళ్ళీ వాటి జోలికే వెళ్ళలేదు. అందుకే ఈ సందర్భాన్ని వాడుకుని జర్నలిస్ట్ ఈ ప్రశ్న అడగగా, చిరు సమాధానం ఇచ్చారు. 
 
నిజానికి దానికి స్పష్టమైన కారణం అంటూ ఏదీ లేదని, తెలుగు సినిమాల్లో విపరీతంగా బిజీ కావడం వల్ల ఆ తర్వాత రాజకీయాల్లో కొన్నేళ్లు గడపాల్సి రావడం వంటి కారణాల వల్ల బాలీవుడ్ గురించి ఆలోచించే వ్యవధి లేకపోయిందని చెప్పారు. అయితే ఇప్పుడు ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్ కథ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments