కుర్రపిల్లోడిలా రెచ్చిపోతుంటే మతి పోయింది అంకుల్.. అందుకే మీరు మెగాస్టార్ : మంచు లక్ష్మి

బుధవారం, 21 ఆగస్టు 2019 (12:17 IST)
మెగాస్టార్ చిరంజీవిపై నటి మంచు లక్ష్మీ ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి నటించిన చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం టీజర్ మంగళవారం విడుదలైంది. ఈ టీజర్‌ను చూసిన ప్రతి ఒక్కరూ సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
అలా టాలీవుడ్ బహుముఖ ప్రజ్ఞావంతురాలిగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి కూడా సైరా టీజర్‌ను తిలకించి స్పందించారు. ఎన్నటికీ తరగని ఎనర్జీతో మీరలా రెచ్చిపోతుంటే మతి పోయింది చిరంజీవి అంకుల్. మిమ్మల్నందరూ మెగాస్టార్ అనేది అందుకేనని అర్థమైంది అంటూ ట్వీట్ చేశారు.
 
అలాగే, ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో చెర్రీకి ఆమె శుభాభినందనలు తెలిపారు. తెలుగు సినిమాకు మరింత నాణ్యతను అందిస్తున్నందుకు గర్విస్తున్నామని తెలిపారు. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఉందని వ్యాఖ్యానించారు. 
 
అలాగే, మరో హీరో అయిన మంచు మనోజ్ కూడా స్పందించారు. 'మిత్రమా రామ్ చరణ్, నీ ప్రొడక్షన్ విలువలు అదుర్స్' అంటూ ట్వీట్ చేశారు. మిమ్మల్ని (చిరంజీవి) ఓ యోధుడిగా తెరపై చూసేందుకు ఆగలేకపోతున్నానంటూ మనోజ్ తన స్పందన తెలియజేశారు. 
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కారు ప్రమాదం ఎలా జరిగిందంటే.. శబ్దానికి చెవులు వినిపించలేదు.. కళ్ళు కనిపించలేదు... రాజ్ తరుణ్