Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#SyeRaaNarasimhaReddy ఫస్ట్ టీజర్ వచ్చేసింది..(Video)

Advertiesment
Chiranjeevi
, మంగళవారం, 20 ఆగస్టు 2019 (18:16 IST)
మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'సైరా'. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హై రేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. సైరా టీజర్ చూసినంత సేపు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉందంటే, ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందని మెగా అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. 
 
తాజాగా విడుదలైన మూవీ మేకింగ్ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ రాగా, ఇప్పుడు విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌లో చిరంజీవి తనయుడు రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
 
తెలుగులో ఈ చిత్ర టీజర్ ఇంట్రో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇవ్వడం విశేషం. అలాగే మలయాళంలో మోహన్‌లాల్ వాయిస్ ఓవర్ అందించాడు. తెలుగులో పవన్ చెప్పిన మాటలు ఫస్ట్ టీజర్‌కే హైలెట్‌గా నిలిచాయి.
 
 చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తుండగా, అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు, తమన్నా వంటి ప్రముఖ నటీనటులో ఈ చిత్రంలో నటిస్తున్నారు. 2019 అక్టోబ‌ర్ 2వ తేదీన గాంధీ జ‌యంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్న మరో సినీ వారసుడు