బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్‌కు పరిచయమై అడపాదడపా సినిమాలు తీస్తున్నప్పటికీ పెద్దగా హిట్‌లను స్వంతం చేసుకోలేకపోయాడు. జయ జానకీ నాయకా సినిమా ఫర్వాలేదనిపించినప్పటికీ ఆయన ఖాతాలో హిట్‌ను చేర్చలేకపోయింది. అయితే తాజాగా ఆయన నటించిన "రాక్షసుడు" సినిమా విడుదలై ఆ లోటు తీర్చింది.
ఇది తమిళంతో విడుదలై హిట్ సాధించిన "రాచ్చసన్" సినిమాకు రీమేక్. ఈ సినిమా తర్వాత తన కుమారుడు శ్రీనివాస్‌తో మరో సినిమా తీసే ప్రయత్నాలలో ఉన్నట్లు ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించిన బెల్లంకొండ సురేశ్ సరైన దర్శకుడి కోసం చూస్తున్నట్లు చెప్పారు.
గత కొంతకాలంగా ఆయన తమ్ముడు సాయి గణేశ్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న సినిమాలో సాయి గణేశ్ నటించబోతున్నట్లు సమాచారం. ప్రేమ కథగా రూపొందనున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ‘హుషారు’ నిర్మాత బెక్కం వేణుగోపాల్‌తో కలిసి బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా దసరాకు పట్టాలెక్కనున్నట్లు టాలీవుడ్ టాక్.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘రాక్షసుడు’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయం అందుకుంది. తమిళ సినిమా ‘రాచ్చసన్’కు తెలుగు రీమేక్ ఇది.