సైరా న‌ర‌సింహారెడ్డి, సాహో, అల్లూరి ఒకే చోట క‌లిస్తే...?

బుధవారం, 21 ఆగస్టు 2019 (13:14 IST)
తెలుగు ప్రజలు గర్వించేలా రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సాహో, సైరా నరసింహా రెడ్డి సినిమాలపై అభిమానుల అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక రెండు సినిమాల్లో నటించిన స్టార్స్ పక్కపక్కనే కనిపిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం. 
 
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కలిసున్న ఫొటో నెటిజన్స్‌ని ఆకట్టుకుంటోంది.రీసెంట్‌గా బాలీవుడ్ మీడియా ముందుకు వెళ్లిన సైరా యూనిట్ అక్కడ సినిమా టీజర్‌ని రిలీజ్ చేసింది. ఇక ప్రభాస్ కూడా సాహో సినిమా ప్రమోషన్‌లో భాగంగా రోజు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. 
 
అనుకోని విధంగా ప్రభాస్ మెగాస్టార్‌ని అలాగే రామ్ చరణ్‌ని కలిసి టీజర్ చాలా బావుందని శుభాకాంక్షలు తెలియజేశారు. సాహో సినిమా ఈ నెల 30న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అలాగే సైరా అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మెగాస్టార్ పుట్టినరోజుకు గెస్ట్ ఎవ‌రో తెలుసా..?