‘సైరా’లో జనసేనాని స్వరం.. చిరు సమక్షంలో గళం వినిపించిన పవన్

శుక్రవారం, 16 ఆగస్టు 2019 (10:55 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రంలో పవర్ స్టార్ స్వరం వినిపిస్తే... ఆ స్వరం చిత్ర కథలోకి మనల్ని నడిపిస్తే... ఇక అభిమాన గణం ఆనందానికి అవధులు ఏముంటాయి. ఆ స్థాయి ఆనందం త్వరలోనే అభిమానులకు అందబోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ చిత్రానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ అందించారు. 
 
‘సైరా’ టీజరుకి కొద్ది రోజులనాడే పవన్ కల్యాణ్ గారు వాయిస్ ఓవర్ చెప్పారు. తమ్ముడు తన చిత్రానికి భావోద్వేగంతో స్వరం వినిపిస్తుంటే అన్నయ్య శ్రీ చిరంజీవి గారు పక్కనే ఉన్నారు. బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన సమయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితానికి వెండి తెర రూపం ఈ చిత్రం. 
 
ఈ చారిత్రక వీరుడి ఘనతను పరిచయం చేసే వాక్యాలు పవన్ కల్యాణ్ గళం నుంచి వినబోతున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నయ్య, తమ్ముడు కలిసి వెండి తెరపై కొద్ది క్షణాలపాటు కనిపించిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్. చిత్రాన్ని ప్రేక్షకులు మరచిపోలేదు. ఇప్పుడు అన్నయ్య నటించిన 151వ చిత్రానికి తమ్ముడు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పడం ప్రేక్షక లోకాన్ని కథలోకి తీసుకువెళ్తుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బాలీవుడ్ నటి విద్యా సిన్హా ఇకలేరు... నరసింహా సినీ గేయరచయిత కూడా