Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్ నటి విద్యా సిన్హా ఇకలేరు... నరసింహా సినీ గేయరచయిత కూడా

Advertiesment
Vidya Sinha
, గురువారం, 15 ఆగస్టు 2019 (16:30 IST)
ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాసిన్హా కన్నుమూశారు. ఈమె వయసు 71 యేళ్లు. గత కొంతకాలంగా శ్వాససంబంధ సమస్యతో బాధపడుతూ వచ్చిన విద్యా సిన్హా... ముంబైలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
ఈమె రజనీగంధ, ఛోటి సి బాత్, మేరా జవాన్, ఇంకార్, జీవన్ ముక్త్, బాడీగార్డ్ తోపాటు పలు చిత్రాల్లో నటించారు. విద్యాసిన్హా పలు టీవీ సీరియళ్లలో కూడా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
 
అలాగే, ప్రముఖ తెలుగు సినీ గీత ర‌చ‌యిత శివ గ‌ణేష్ కూడా గురువారం కన్నుమూశారు. ఈయన హైదరాబాద్‌, వనస్థ‌లిపురంలోని త‌న నివాసంలోనే గుండెపోటుతో కన్నుమూశారు. 
 
ఈయన ప్రేమికుల రోజు, న‌ర‌సింహా, జీన్స్‌తో పాటు.. వెయ్యికి పైగా చిత్రాలకు పాటలు రాశారు. ఆయ‌నకి భార్య నాగేంద్ర‌మ‌ణి .. సుహాస్, మాన‌స్ అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. శివ‌గ‌ణేష్ ఆక‌స్మిక మృతితో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమర జవాన్ల కోసం ఏకమైన బాలీవుడ్... తు దేశ్ మేరా...