Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుని మళ్లీ కలిసిన వంశీ, ఇంతకీ మహేష్ రియాక్షన్ ఏంటి..?

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (20:38 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వంశీ చెప్పిన స్టోరీ నచ్చకపోవడంతో మహేష్‌ పరశురామ్‌తో సినిమా చేయాలనుకున్నారు.

ఇక అప్పటి నుంచి మహేష్ - వంశీ ప్రాజెక్ట్ గురించి, మహేష్ - పరశురామ్ ప్రాజెక్ట్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటితో పాటు మహేష్ మరికొంత మంది దర్శకుల కథలు వింటున్నారు. దీనికితోడు మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందే సినిమాలో మహేష్ నటించడం లేదని ఓ కొత్త వార్త బయటకు వచ్చింది. దీంతో మహేష్ నెక్ట్స్ మూవీ అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
 
మహేష్ బాబుని వంశీ పైడిపల్లి మార్చి 4న మళ్లీ  కలిసారని.. కొత్త స్టోరీ లైన్ వినిపించారని తెలిసింది. ఈ స్టోరీ లైన్ విన్న మహేష్‌ బాబు లైన్ బాగుంది. ఫుల్ స్క్రిప్ట్ విన్న తర్వాత ఫైనల్ డిషిసన్ చెబుతానన్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి ఈ కొత్త లైన్‌ని డెవలప్ చేసే పనిలో ఉన్నారని తెలిసింది. వంశీతో ఉన్న అనుబంధం కారణంగా మహేష్ మరో అవకాశం ఇచ్చారు. 
 
అయితే.. వెంటనే సినిమా చేసేయాలి అనే కంగారు ఏమీ లేదు. సినిమా బాగుండేలా.. కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలిగించేలా ఉండేలా ఫుల్ స్టోరీ రెడీ చేయమని వంశీకి మహేష్ చెప్పారని వార్తలు వస్తున్నాయి.
 
మహేష్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు రావడం.. లేటెస్ట్‌గా చిరు మూవీలో మహేష్ నటించడం లేదని వార్తలు రావడం.. అలాగే తదుపరి చిత్రం ఎవరితో అనేది ఇంకా ప్రకటించకపోవడంతో అభిమానులు క్లారిటీ ఇవ్వాలంటూ మహేష్ పైన ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. అయితే... మహేష్ కథ ఫైనల్ అయిన తర్వాత అఫిషియల్ ఎనౌన్స్ చేస్తానని.. అభిమానులకు నచ్చే సినిమానే చేస్తానని మాట ఇచ్చారని సమాచారం. మరి.. మహేష్ ఇచ్చిన ఛాన్స్‌ని వంశీ పైడిపల్లి సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments