Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్‌ ఓకే అన్నాక చిరు మూవీ కథలో కీలక మార్పులు చేసారట

Advertiesment
మహేష్‌ ఓకే అన్నాక చిరు మూవీ కథలో కీలక మార్పులు చేసారట
, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (20:06 IST)
మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాలో సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటిస్తున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పైన ఇప్పటివరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. చిరు - మహేష్ ఒకే స్ర్కీన్ పై కనపడనుండడంతో ఈ సినిమా ఎప్పుడు థియేటర్ లోకి వస్తుందా..? ఎప్పుడు చూద్దామా..? అని అటు చిరు అభిమానులు ఇటు మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. 
 
అయితే.. మహేష్‌ బాబు ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినప్పటి నుంచి డైరెక్టర్ కొరటాల ఈ సినిమా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారని తెలిసింది.
 
ఇంతకీ ఆ మార్పులు చేర్పులు ఏంటంటే... మహేష్‌ బాబుతో చేయిస్తున్న పాత్రను చరణ్‌‌తో చేయించాలనుకున్నారు. చరణ్‌ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉండడం వలన మహేష్‌ తో చేయిస్తున్నారనే విషయం తెలిసిందే. చరణ్‌‌తో నక్సలైట్ క్యారక్టర్ చేయించాలి అనుకున్నారు. అయితే... మహేష్ నక్సలైట్ క్యారెక్టర్ చేస్తే బాగోదు అనుకున్నారో ఏమో కానీ.. ఆ క్యారెక్టర్‌ని స్టూడెంట్ లీడర్‌గా మార్చారని తెలిసింది. 
 
మహేష్ బాబు క్యారెక్టర్‌ని చాలా పవర్‌ఫుల్‌గా ఉండేలా డిజైన్ చేసారని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ మహేష్‌ క్యారెక్టర్ని పవర్ ఫుల్‌గా చూపించేలా కథను మార్చి రాస్తున్నారని తెలిసింది. 
 
మరో విషయం ఏంటంటే... చరణ్‌ క్యారెక్టర్ నిడివి 30 నిమిషాలు అనుకున్నారు. మహేష్‌ ఈ క్యారెక్టర్ చేయడానికి ఓకే అని చెప్పిన తర్వాత ఈ 30 నిమిషాల క్యారెక్టర్‌ని 40 నిమిషాలకు మార్చారని వార్తలు వస్తున్నాయి. 
 
మహేష్‌ ప్రస్తుతం తను నటించే తదుపరి చిత్రం కోసం కథలు వింటున్నారు. ఈ సినిమాకి మే నెలలో డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. చిరంజీవి మిగిలన తారాగణం పైన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మే నెలాఖరు నుంచి మహేష్ బాబు పైన ఈ సినిమాకి సంబంధించి సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
 
 మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పైన ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన త్రిష నటిస్తుంది. ఇక మహేష్‌ బాబు సరసన నటించే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. 
 
క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డేని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలతో ఈ సినిమా అప్‌డేట్‌ను అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారు. ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే... చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న ఈ భారీ క్రేజీ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొరటాల కోసం మహేష్‌, మరి.. మహేష్ కోసం కొరటాల ఏం చేస్తున్నాడో తెలుసా?