మహేష్ బాబు ఫోన్, 'గీత గోవిందం' పరశురామ్ పరేషాన్... అసలు ఏం జరిగిందంటే?

మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (13:55 IST)
మహేష్‌ - వంశీ పైడిపల్లి.. మహర్షి సినిమా చేయడం.. ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించడంతో పాటు మంచిపేరు తీసుకువచ్చింది. దీంతో మహేష్‌ వంశీ పైడిపల్లికి మరో ఛాన్స్ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుకున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళుతుంది అనుకున్నారు. ఇంతలో.. ఈ సినిమా ఆగింది అంటూ వార్తలు వచ్చాయి. 
 
ఇంతకీ.. ఏం జరిగిందంటే... మహేష్‌కి వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీ లైన్ నచ్చిందట కానీ.. సెకండాఫ్ విషయంలో సంతృప్తి చెందలేదట మహేష్‌. దీంతో వంశీ పైడిపల్లి ప్రస్తుతం కథ పై మళ్లీ కసరత్తు చేస్తున్నారట. అయితే.. మహేష్‌కి గతంలో గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన పరశురామ్ ఓ కథ చెప్పారు. కథ బాగుంది కానీ.. ఇప్పట్లో ఆ సినిమా చేయలేను అని మహేష్ అప్పుడు చెప్పారు. ఇప్పుడు వంశీ పైడిపల్లి చెప్పిన కథపై సంతృప్తి చెందకపోవడంతో మహేష్ పరశురామ్‌కి కబురు పంపాడని తెలిసింది. 
 
పరశురామ్ దగ్గర కథ రెడీగా ఉంది. మహేష్‌ - పరశురామ్ కాంబినేషన్లో మూవీని నిర్మించడానికి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు 14 రీల్స్ ప్లస్ సంస్థ కూడా రెడీగా ఉంది. దీంతో మహేష్‌ - వంశీ పైడిపల్లి మూవీ ఆగింది. మహేష్ పరశురామ్‌తో సినిమా చేయనున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే... పరశురామ్ నాగ చైతన్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పరశురామ్ చైతుతో సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు.
 
ఇలాంటి టైమ్‌లో మహేష్ పిలిచి సినిమా ఇస్తానంటే పరశురామ్ చైతన్య సినిమాని ప్రస్తుతానికి వదిలేస్తాడా అనేది మరో ప్రశ్న. మహేష్.. వంశీ పైడిపల్లికి ఓ పది రోజులు టైమ్ ఇచ్చాడట. ఈ పది రోజుల్లో సెకండాఫ్‌లో మార్పులు చేసి మహేష్‌‌ని మెప్పిస్తే వంశీ పైడిపల్లితోనే సినిమా ఉంటుంది. లేదా ఇప్పుడు చెప్పిన స్టోరీ కాకుండా మరో స్టోరీతో మెప్పించినా వంశీ పైడిపల్లికే ఛాన్స్. వంశీ మెప్పించలేకపోతే... అప్పుడు పరశురామ్ స్టోరీతో సినిమా చేస్తాడట. ఒకవేళ పరశురామ్ చైతన్యతో సినిమా చేసిన తర్వాత మహేష్‌‌తో సినిమా చేస్తానంటే... మహేష్ దగ్గర మరో ఆప్షన్ కూడా ఉందని తెలిసింది.

అది ఏంటంటే... రీసెంట్‌గా ఓ కొత్త దర్శకుడు మహేష్‌‌కి కథ చెప్పాడట. ఆ కథ మహేష్‌‌కి నచ్చిందని సమాచారం. సో.. ఎవరితోనూ సెట్ కాకపోతే కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీతో అయినా సరే.. సినిమా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడని తెలిసింది. ఏదిఏమైనా మే నెలలో షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారట సూపర్ స్టార్. మరి.. మహేష్ ఎవరితో సినిమా చేయనున్నాడో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం #Buttabomma అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' బుట్టబొమ్మ బ్లాక్ బస్టర్