Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ - చిరు మూవీలో మహేష్ నటించడం లేదు

Advertiesment
mahesh babu is not acting with chiranjeevi's movie
, మంగళవారం, 3 మార్చి 2020 (22:58 IST)
మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇందులో మహేష్ పాత్ర నిడివి 40 నిమిషాలు ఉంటుందని.. ఈ 40 నిమిషాల నిడివి గల పాత్ర చేయడానికి 40 కోట్లు ఇస్తున్నారని, ఇలా టాలీవుడ్‌లో టాక్ వినిపించింది. 
 
ఇక చిరు - మహేష్ బాబు కాంబో సెట్ అయ్యింది అనుకున్నారు. మే నెలాఖరు నుంచి మహేష్ బాబు పైన సీన్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేసారు. అయితే... ఏమైందో ఏమో కానీ.. మహేష్ బాబు ఈ సినిమాలో నటించడం లేదని తాజాగా వార్త బయటకు వచ్చింది. ఈ పాత్రను ముందుగా అనుకున్నట్టుగా చరణ్‌తోనే చేయించాలనుకుంటున్నారు. చరణ్‌ ఈ సినిమాలో నటిస్తే... ఆర్ఆర్ఆర్ తర్వాతే రిలీజ్ చేయాలి. 
 
ఎందుకంటే ఆర్ఆర్ఆర్ కంటే ముందుగా చరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ తమ సినిమాలను రిలీజ్ చేయకూడదు అని రాజమౌళి ముందుగానే కండిషన్ పెట్టారు. ఆ కండీషన్ ప్రకారం చిరు మూవీ ఆచార్యలో చరణ్‌ నటిస్తే.. ఆర్ఆర్ఆర్ తర్వాత అంటే 2021 జనవరి తర్వాత రిలీజ్ చేయాలి. 
 
అందుకనే చరణ్‌ పాత్రను మహేష్ బాబుతో చేయించి ఆగష్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. మెగాస్టార్‌ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రాజమౌళి చరణ్‌ చిరు మూవీలో నటించినా అభ్యంతరం లేదని.. అలాగే ఆర్ఆర్ఆర్ కంటే ముందుగా ఆగష్టులో రిలీజ్ చేసుకోవచ్చు అని జక్కన్న చెప్పాడని టాక్ వచ్చింది.

అందుకనే మహేష్ బాబుతో కాకుండా ముందుగా అనుకున్న ప్రకారం చరణ్‌తోనే ఆ పాత్రను చేయించాలి అనుకుంటున్నారని తెలిసింది. ఈ సినిమాని ఆగష్టులో లేదా అక్టోబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది కానీ... 2021 మార్చిలో రిలీజ్ చేస్తారని మరో వార్త కూడా వినిపిస్తోంది.
 
చిరు మూవీలో మహేష్ నటిస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అటు చిరు ఫ్యాన్స్, ఇటు మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్ లోకి వస్తుంది అని ఎంతో ఆసక్తితో ఎదురుచూసారు. ఇప్పుడు చిరు, మహేష్ కాంబినేషన్‌కి బ్రేక్ పడిందని తెలియగానే.. అరే.. వీళ్లిద్దరూ కలిసి నటిస్తే ఎంత బాగుణ్ణు అనుకుంటున్నారు. మే నెలాఖరు నుంచి చరణ్‌ పైన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలో ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాపం.. మహేష్, ప్రభాస్ హ్యాండ్ ఇచ్చారు, అందుకే ఈసారి ప్లాన్ మార్చాడా..?