Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్.. వెంకీ, చిరులతో ఓకే, మరి.. బాలయ్య, నాగ్‌లతో ఎప్పుడు?

Advertiesment
Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు..  సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ బాబుతో కలిసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ములుగా నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా చేస్తుండటం విశేషం. మహేష్ మే నెలాఖరు నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. అయితే... మహేష్ బాబు... నాగార్జునతో కలిసి సినిమా చేయాలనుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే సినిమాని గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించాలి అనుకున్నారు.
 
నాగార్జున, మహేష్ బాబు ఇద్దరికీ మణిరత్నం కథ చెప్పడం.. కథ విని నాగార్జున, మహేష్ ఓకే చెప్పడం జరిగిందని వార్తలు వచ్చాయి. అక్కినేని, ఘట్టమనేని ఫ్యామీలీ మధ్య మంచి అనుబంధం ఉండటంతో ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి వార్త బయకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా..? సినిమా ఎలా ఉంటుంది..? అని నాగార్జున, మహేష్ అభిమానులు ఈ సినిమాపై ఎంతో ఇంట్రస్ట్ చూపించారు. 
 
అయితే... ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా థ్రిల్లర్ కథాంశంతో మణిరత్నం సినిమా తీయాలనుకున్నారు. దీంతో ఈ కథ వర్కవుట్ కాదేమో అని నాగ్, మహేష్ వేరే కథతో సినిమా చేద్దామని మణిరత్నంకు చెప్పడం వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు తెలిసింది.
 
ఇక చిరంజీవి సినిమాలో నటించేందుకు మహేష్ ఎందుకు ఓకే చెప్పాడంటే... కథ బాగా నచ్చడంతో పాటు మహేష్ కోసం డిజైన్ చేసిన క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండటంతో మహేష్ విన్న వెంటనే ఓకే చెప్పాడని తెలిసింది. 
 
స్టూడెంట్ లీడర్ పాత్రలో మహేష్ కనిపిస్తారని.. మహేష్ చెప్పే డైలాగులు స్టూడెంట్స్‌ని ఆలోచింపచేసేలా ఉంటాయని తెలిసింది. ఏది ఏమైనా మహేష్ చిరంజీవి సినిమాలో నటించడంతో ఈ ప్రాజెక్ట్ పైన మరింత క్రేజ్ ఏర్పడింది. ఆగష్టు 22న ఈ సినిమాని వరల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. మహేష్.. బాలయ్య, నాగార్జునలతో కూడా భవిష్యత్‌లో సినిమాలు చేస్తాడని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్‌కి రివర్స్‌లో చరణ్‌, ఇంతకీ ఏమైంది?