Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్‌కి రివర్స్‌లో చరణ్‌, ఇంతకీ ఏమైంది?

Advertiesment
ఎన్టీఆర్‌కి రివర్స్‌లో చరణ్‌, ఇంతకీ ఏమైంది?
, సోమవారం, 2 మార్చి 2020 (14:47 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌.. దర్శకధీరుడు రాజమౌళి.. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతోన్న ప్రెస్టేజీయస్ మూవీ ఆర్ఆర్ఆర్. బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ డి.వి.వి. దానయ్య ఈ సినిమాని ఏమాత్రం రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని జులై 30న రిలీజ్ చేయాలనుకున్నారు. అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు  కానీ.. షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకపోవడం వలన 2021 జనవరి 8కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
 
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేసే సినిమాని ఫైనల్ చేసారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సమ్మర్లో షూటింగ్ స్టార్ట్ చేసి.. 2021 సమ్మర్లో సినిమాని రిలీజ్ చేయనున్నాయి. అయితే... ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్నారు. ఆ తర్వాత చేసే సినిమాలను కూడా స్టార్ డైరెక్టర్స్ తోనే ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
 
ఎన్టీఆర్ ఇలా... స్టార్ డైరెక్టర్స్‌తో సినిమాలు ప్లాన్ చేస్తుంటే.. రామ్ చరణ్ మాత్రం ఎన్టీఆర్‌కి రివర్స్‌లో ఆలోచిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత సోలోగా చేసే సినిమా కోసం కథలు వింటున్నారు. జెర్సీ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గౌతమ్ తిన్ననూరితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ గౌతమ్, చరణ్‌కి కథ చెప్పడం.. కథ నచ్చడంతో ఫుల్ స్టోరీ రెడీ చేయమని గౌతమ్‌కి చెప్పడం జరిగిందని తెలిసింది. 
 
గౌతమ్ ప్రస్తుతం జెర్సీ మూవీని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ కంప్లీట్ అయిన తర్వాత చరణ్‌‌తో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. రన్ రాజా రన్ సినిమాతో సక్స్ సాధించిన సుజిత్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సాహో సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకుల కంటే ఎక్కువుగా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషం. ఈ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి చరణ్‌ ఇంట్రస్ట్ చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#PSPK26 నుంచి ప్రీ లుక్ పోస్టర్.. పవన్ ఫ్యాన్సుకు పండగే