Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#PSPK26 నుంచి ప్రీ లుక్ పోస్టర్.. పవన్ ఫ్యాన్సుకు పండగే

Advertiesment
Pawan Kalyan
Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు శుభవార్త. రెండేళ్ల విరామం తర్వాత పవన్ కల్యాణ్ వెండితెరపై కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ 26వ సినిమా, బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘పింక్’ తెలుగు రీమేక్ ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది. ఈ సినిమాకు''వకీల్ సాబ్'' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
 
ఈ సినిమాకు సంబంధించిన సోమవారం అంటే మార్చి 1వ తేదీన, సాయంత్రం ఐదు గంటలకు #PSPK26 ఫస్ట్ లుక్ విడుదల కానుందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. 
 
బాలీవుడ్ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే?