Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల‌ర్ ఎగ‌రేసిన మ‌హేష్‌... నాయ‌నా మ‌హేషా.. నిజంగా సినిమాలో అంతుందా..?

Webdunia
సోమవారం, 13 మే 2019 (10:52 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి సినిమా ఇటీవ‌ల ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. మంచి సినిమా అంటూ అభినంద‌న‌లు వ‌స్తున్నాయి అయితే... ఈ సినిమా చూస్తుంటే చాలా సినిమాలు గుర్తొస్తున్నాయి అని సినీ పండితులు విశ్లేషించ‌డం తెలిసిందే. కానీ... మ‌హ‌ర్షి టీమ్ మాత్రం పెద్ద విజ‌యం సాధించాం అంటూ స‌క్స‌స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. హైద‌రాబాద్ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన స‌క్స‌స్ మీట్‌లో మ‌హేష్ మాట్లాడిన తీరు... ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న కాస్త ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. 
 
మ‌హేష్ మ‌హ‌ర్షి గురించి స్పందిస్తూ... నా 25 సినిమాల జ‌ర్నీ ఎంతో ప్ర‌త్యేకం. అందులో ఈ సినిమా మ‌రింత ప్ర‌త్యేకం. మ‌ద‌ర్స్ డే.. అమ్మంటే దేవుడితో స‌మానం. ప్ర‌తిసారి అమ్మ ద‌గ్గ‌ర‌కు వెళ్లి కాఫీ తాగుతాను. అలా తాగితే నాకు దేవుడి గుడిలో ప్ర‌సాదం తిన్నట్టుగా ఉంటుంది. ఆవిడ ఆశీస్సులు నాకు ఎంతో ముఖ్యం. కాబ‌ట్టి ఈ స‌క్సెస్‌ను అమ్మ‌లంద‌రికీ డేడికేట్ చేస్తున్నాను. 
 
దేవిశ్రీ ట్రూలీ రాక్‌స్టార్‌. నాకు దేవి అంటే ప్రాణం.` ప‌ద‌రా ప‌ద‌రా..` `ఇదే క‌దా ఇదే క‌దా..` సాంగ్స్‌ క‌థ‌లో భాగంగా వెళ‌తుంటాయి. నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రూ త‌న‌లా కంపోజ్ చేయ‌లేరేమో. ఇప్ప‌టికీ నాకు గూజ్‌బ‌మ్స్ వ‌స్తున్నాయి. ఈ సినిమా మూడేళ్ల ప్రాసెస్‌. మ‌ర‌చిపోలేని అనుభ‌వాలున్నాయి. దిల్ రాజు గారు తొలిసారి క‌థ విని క్లాసిక్ అన్నారు. నాకు ఫోన్ చేశారు. గ‌త ఏడాది ద‌త్తు గారు క‌థ విని, ఈ సినిమా ఓ గేమ్ చేంజ‌ర్ అవనుంది ప్రిన్స్ అన్నారు.
 
నేను క్రికెట్‌కు చాలా పెద్ద ఫ్యాన్‌ని. 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌కు వెళ్లాను. చివ‌ర్లో ధోని సిక్స్ కొట్టిన‌ప్పుడు చాలా సంతోష‌ప‌డ్డాను. అప్పుడు ఎంత ఆనందం వేసిందో దిల్ రాజు గారు సిక్సర్ కొట్టాం అన‌గానే అంతే ఆనందం వేసింది. మూడు పెద్ద బ్యాన‌ర్స్‌లో నా సినిమా రావ‌డం గ‌ర్వంగా ఉంది. సాధార‌ణంగా ద‌త్తు గారు ప్రిన్స్‌, బాబు అని పిలుస్తుంటారు. విప‌రీతంగా న‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే మ‌హేష్ అని పిలుస్తుంటారు. అలా ఎప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూస్తుంటాను. 
 
 
ఈ సినిమా చూసిన త‌ర్వాత ఆయ‌న అలా పిలిచారు. మ‌హేష్ .. నువ్వు స‌మ్‌థింగ్ ఎల్స్‌.. ఈ సినిమా కూడా స‌మ్‌థింగ్ ఎల్స్ అన్నారు. నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌ను వ‌న్ వీక్‌లో దాటేయ‌బోతున్నాం. దీనికి మించిన ఆనందం నాకు లేదు. ఆడియ‌న్స్‌, నా అభిమానులకు హ్యాట్సాఫ్. ముందుగా న‌రేష్ గారికి థాంక్స్‌.. ఎందుకంటే, ఆయ‌న ఈ క్యారెక్ట‌ర్‌ను చేస్తాడా? అనుకున్నాను. కానీ.. ఆయ‌న ఒప్పుకున్నందుకు ఆయ‌నకు ధన్య‌వాదాలు. వంశీ గురించి చాలా విష‌యాలే చెప్పాను. 
 
కానీ ఓ విష‌యం చెప్పాల‌నుకుంటున్నాను. నా అభిమానులు, నాన్న‌గారి అభిమానులు కాల‌ర్ ఎత్తుకుని తిరుగుతార‌ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. ఇప్పుడు నేను కూడా కాల‌ర్ ఎత్తుకుంటున్నాను అని చెప్ప‌డ‌మే కాకుండా చేసి చూపించారు అని అన్నారు. 
 
ఈ సినిమాకి ఫ‌స్ట్ డే 24.6 కోట్లు వ‌చ్చింది. 5 ఆట‌లు వేసి.. టిక్కెట్ల రేట్లు పెంచినా కూడా అంతే రావ‌డం అంటే కాస్త త‌క్కువే. ఆ త‌ర్వ‌ాత క‌లెక్ష‌న్స్ త‌గ్గాయి అయినా కానీ... ఇది చాలా పెద్ద విజ‌యం అంటూ మాట్లాడుతున్నారు. ఇది చూసి సినీ పండితులు నాయ‌నా.. మ‌హేషా సినిమాలో అంతుందా...? ఎందుకు అంత ఎమోష‌న్ అయిపోతున్నావ్ అంటున్నారు. వారం రోజుల త‌ర్వాత మ‌హేష్ అస‌లు విష‌యం తెలుసుకుంటాడేమో..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారులో భార్య, ఆమె పక్కనే ప్రియుడు, కారు బానెట్ పైన మొగుడు (video)

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు : మంత్రి కుమార స్వామి

నాతో గడిపేందుకు హోటల్ గదికి రా, లేదంటే నీ ఏకాంత వీడియోలు బైటపెడతా: టెక్కీ సూసైడ్

విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ : కేంద్రం ప్రకటన

'గేమ్ ఛేంజర్' పైరసీ సినిమాను టెలికాస్ట్ చేసిన లోకల్ టీవీ ఓనర్ అరెస్టు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments