Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నమ్రత శిరోద్కర్ ఫైబియాతో బాధపడుతున్నారా? కాస్త మేకర్ వేసుకోవచ్చుగా..?

Advertiesment
నమ్రత శిరోద్కర్ ఫైబియాతో బాధపడుతున్నారా? కాస్త మేకర్ వేసుకోవచ్చుగా..?
, ఆదివారం, 12 మే 2019 (13:29 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్.. ఇంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. అలాగే తన భర్త మహేష్ బాబు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. పిల్లలను చూసుకుంటూ ప్రిన్స్‌కు అన్నీ తానై వుంటున్నారు. ఇటీవల మహేష్ బాబు మహర్షి సినిమా కోసం ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సినిమా రిలీజై మంచి హిట్ టాక్ వచ్చేదాకా నిద్రపోలేదు. 
 
మహేష్ సక్సెస్ గురించి సర్వదా ఆలోచిస్తూ గడిపే నమ్రత.. బయట ఫంక్షన్లలో మేకప్ వేసుకుని కనిపించరు. సింపుల్‌గా మాత్రమే కనిపిస్తారు. అలాంటి నమ్రతకు సోషల్ మీడియాలో ఫ్యాన్ నుంచి మేకప్‌కు సంబంధించి ప్రశ్న ఎదురైంది. తాజాగా నమ్రతా శిరోద్కర్ మహర్షి సినిమా రిలీజ్ సందర్భంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఓ సెల్ఫీ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో నమ్రత చాలా సింపుల్‌గా కనిపిస్తున్నారు.
 
ఈ ఫోటోపై స్పందించిన గౌరవ్ అనే నెటిజన్.. మాజీ మిస్ ఇండియా ఫొటోలు పెట్టేటప్పుడు కాస్త మేకప్ వేసుకోవచ్చుగా... మీరు డిప్రెషన్ (ఒత్తిడి)లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఫైబియాతో బాధపడుతున్నారా..? అందుకే మేకప్ వేసుకోలేదేమో.... అంటూ ఇన్‌స్టాగ్రాం యూజర్ అభ్యంతరకరమైన కామెంట్ పెట్టాడు. అతను తప్ప మిగతా అందరూ... ఆ పిక్‌పై పాజిటివ్‌గానే స్పందించారు.
 
దీనిపై నమ్రతా ఘాటుగా స్పందించారు. ''గౌరవ్ మీరు మేకప్‌తో ఉన్న మహిళల్ని ఇష్టపడతారేమో... ఒక వేళ మీరు ఎప్పుడూ మేకప్‌తో ఉన్నవారిని ఫాలో అవుతారేమో... అది మీకు సెట్ కావచ్చు. అలాంటివి ఈ పేజీపై మీకు కనిపించవు. కాబట్టి మీరు ఆ విషయాన్ని వదిలేయడం మంచిది. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్" అని నమ్రతా రిప్లై ఇచ్చింది.
 
నమ్రాతా రిప్లైకి పెద్ద ఎత్తున లైక్స్ వచ్చాయి. చాలామంది ఆమె కామెంట్‌కి సపోర్ట్ చేశారు. మహిళలు ఎల్లప్పుడూ మేకప్‌లో ఉండాల్సిన అవసరం లేదంటూ... గౌరవ్‌కి సలహా ఇస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవిపై జాన్వీ కపూర్ ఎమోషనల్ ట్వీట్.. నువ్వు లేని మదర్స్ డే.. అనసూయ కూడా?