సూపర్ స్టార్ మహేష్ హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందించిన భారీ చిత్రం మహర్షి. మహేష్ సరసన పూజా హేగ్డే నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. మహేష్ 25వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన మహర్షి అంచనాలకు తగ్గట్టుగానే రికార్డు స్ధాయి కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
నైజాంలో రూ. 6.38 కోట్లు,
సీడెడ్‌లో రూ. 2.89 కోట్లు,
ఉత్తరాంధ్ర రూ. 2.88 కోట్లు,
ఈస్ట్ రూ. 3.2 కోట్లు,
వెస్ట్ రూ. 2.47 కోట్లు,
కృష్ణా రూ. 1.39 కోట్లు,
గుంటూరు రూ. 4.4 కోట్లు,
నెల్లూరు రూ. 1 కోటి
కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ. 24.6 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం.
మహర్షి తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల కలెక్షన్స్ వివరాలు..?
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషన్ మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక రెండు రోజుల కలెక్షన్స్ వివరాలు..
నైజాం - 9.67 కోట్లు
సీడెడ్ - 4.01 కోట్లు
వైజాగ్ - 3.93 కోట్లు
ఈస్ట్ - 3.8 కోట్లు
వెస్ట్ - 2.90 కోట్లు
కృష్ణ - 2.13 కోట్లు
గుంటూరు - 4.89 కోట్లు
నెల్లూరు - 1.24 కోట్లు
రెండు రోజులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 32.57 కోట్లు.