Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"మహర్షి" మూవీ గురించి 'దిల్' రాజు ఏమన్నారు?

Advertiesment
, గురువారం, 9 మే 2019 (10:46 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన "మ‌హ‌ర్షి". ఈ చిత్రం మే 9వ తేదీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే... ఈ సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ, తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం టికెట్ రేట్ల పెంపుకు అనుమ‌తి ఇవ్వ‌లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం ముగిసిపోయిందనే ప్రచారం జరిగింది. 
 
ఈ నేపథ్యంలో 'మ‌హ‌ర్షి' చిత్ర నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ... ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన‌ట్టుగా మ‌హేష్ బాబు కెరీర్‌లో కొన్ని టాప్ ఫిల్మ్స్ ఉన్నాయి. అలాగే ఈ మ‌హ‌ర్షి కూడా ఆ టాప్ ఫిల్మ్స్ ప‌క్క‌న నిల‌బ‌డ‌బోతుంది. ఫ్యాన్స్‌కి కూడా ఇంత ముందు చెప్పాను. ఎంత పెద్ద స‌క్స‌స్ కావాల‌ని ఆశ ఉందో.. అంత కోరుకోండి అని. అది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో చెప్పింది కాదు. ఈ సినిమా క‌థ విన్న‌ప్ప‌టి నుంచి ప్రీరిలీజ్ ఈవెంట్ కంటే ముందే ఫుల్‌గా సినిమా కూడా చూడ‌డం జ‌రిగింది. 
 
కొన్ని సినిమాలు ఎట్టి ప‌రిస్థితుల్లో మన అంచనాలను తారుమారుచేయవు. సినిమా చూసాం బాగుంది. హీరో బాగా చేసాడు అని కాకుండా దీనిలో చాలా చాలా ప్ర‌త్యేక‌తలు ఉన్నాయి. అది ఇప్పుడు చెప్ప‌డం కంటే ఎక్స్‌పీరియ‌న్స్ చేస్తేనే బాగుంటుంది. కొన్ని సినిమాలు మీరు చూసిన‌ప్పుడు సినిమా అయిపోయే టైమ్‌లో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎంత మంచి సినిమా చూసాం. ఎంత మంచి సినిమా తీసారు అని. అలాంటి ఫీలింగ్‌ని ఈ సినిమా అందిస్తుంది. 
 
ఇది నా సినిమా కాకున్నా.. అలాగే ఫీల‌య్యేవాడిని. గ్రేట్ ఫిలిం కాబోతుంది. మే 9వ తేదీ అశ్వ‌నీద‌త్‌కి 'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి' రిలీజ్ కావ‌డం... అలాగే 'మ‌హాన‌టి' రిలీజ్ కావ‌డం సంచ‌ల‌నం సృష్టించ‌డం తెలిసిందే. ఈ డేట్ మ్యాజిక్ మ‌హ‌ర్షితో రిపీట్ అవుతుంది. మ‌హేష్ 25వ సినిమాని ముగ్గురు నిర్మాత‌లు క‌లిసి నిర్మించ‌డం అనేది అదో ప్రత్యేకమైన అనుభూతి. వంశీ ఈ సినిమాతో టాప్ డైరెక్ట‌ర్స్ లిస్టులో చేర‌బోతున్నాడు. ఇది ఒక మ్యాజిక్ ఫిల్మ్. 
 
తెలంగాణ‌లో థియేట‌ర్ ఓన‌ర్సే కోర్టు ద్వారా ప‌ర్మిష‌న్ తెచ్చుకుని టికెట్ రేట్లు పెంచారు. ఆంధ్రాలో కూడా పెరిగాయి. 80 రూపాయ‌ల టికెట్ 100 రూపాయ‌లు, 110 ఉన్న ద‌గ్గ‌ర 125 చేశారు. మ‌ల్టీఫ్లెక్స్ వాళ్లు 150 ఉన్న ద‌గ్గ‌ర 200 చేశారు. వీళ్లంద‌రూ కోర్టు ద్వారా ప‌ర్మిష‌న్ తెచ్చుకున్నారు. మీడియాలో తెలంగాణ ప్ర‌భుత్వం టికెట్ రేట్లు పెంచిన‌ట్టు వార్త‌ల్లో నిజం లేదు. థియేట‌ర్ యాజమాన్యాలు కోర్టు ద్వారా అనుమ‌తి తీసుకుని పెంచారని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"మహర్షి" ఫ్లెక్సీ కడుతూ మహేష్ బాబు అభిమాని