Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో విజయ్‌కు రూ.1.50 కోట్ల అపరాధం.. మద్రాస్ హైకోర్టుకు నివేదిక

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (11:09 IST)
తమిళ అగ్రహీరో విజయ్‌కు ఆదాయన్ను శాఖ రూ.1.50 కోట్ల అపరాధం విధించింది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ ఆయన మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించిన నివేదిక హైకోర్టుకు చేరింది. ఈ వివరాలను పరిశీలిస్తే, హీరో విజయ్ గత 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయ పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేశారు. ఆ యేడాది ఆయన మొత్తం రూ.35,42,91,890 పొందినట్టు పేర్కొన్నారు. దీనిపై మదింపు చేపట్టిన ఆదాయపన్ను శాఖ గత 2015 సెప్టెంబరు 30వ తేదీన హీరో నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. 
 
ఈ తనిఖీల్లో "పులి" చిత్రానికి తీసుకున్న రూ.15 కోట్ల రెమ్యునరేషన్‌ను ఆయన ఆదాయ పన్ను పత్రాల్లో చూపించలేదని తేలింది. దీంతో రూ.1.50 కోట్ల అపరాధాన్ని కోట్ల అపరాధం విధించింది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఈ పిటిషన్‌ విచారించిన హైకోర్టు.. ఆదాయపన్నుశాఖ ఉత్తర్వులకు మధ్యంతర నిషేధం విధిస్తూ, పిటిషన్‌పై ఆదాయపన్ను శాఖ జవాబు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పిటిషన్‌ మంగళవారం మరోమారు విచారణకు వచ్చింది. విజయ్‌కు రూ.1.50 కోట్లు జరిమానా ఎందుకు విధించారనే విషయమై నివేదిక దాఖలు చేయగా కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాత బస్తీలో విషాదం : గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా ముగ్గురి మృతి

కత్తులు గొడ్డళ్లతో 52 మందిని నరికివేశారు... ఎక్కడ?

లేడీ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన తాగుబోతు ఆటో డ్రైవర్

నేడు తీరందాటనున్న వాయుగుండం : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

ముంబై మహానగరంలో రెడ్ అలెర్ట్ .. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments