ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ పెళ్లి తర్వాత కూడా నటిస్తూనే ఉంది. ఇటీవలే 'గంగూభాయ్ కతీయవాడి'కి జాతీయ అవార్డును ప్రకటించారు. భారతదేశంలో అత్యంత ధనిక నటిగా పరిగణించబడుతున్న అలియా భట్ ఆస్తుల విలువ రూ.560 కోట్లు.
ముంబైలో 2, లండన్‌లో ఒక విలాసవంతమైన గృహాలను అలియా భట్ కలిగి ఉంది. అనేక లగ్జరీ కార్లు కూడా ఈ లిస్టులో వున్నాయి. ఇందులో భాగంగా 2019లో ముంబైలోని బాంద్రాలో ఒక అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్థును కొనుగోలు చేసింది అలియా భట్. అదే ఫ్లాట్‌లోని 7వ అంతస్థు భర్త రణబీర్ కపూర్‌కు చెందినది.
ఇది కాకుండా, అలియా భట్ విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్త కూడా ఎదుగుతోంది. ప్రముఖ దుస్తుల బ్రాండ్ యజమాని అలియా భట్ నిర్వహిస్తున్న కంపెనీ వాల్యుయేషన్ ఇప్పుడు రూ.150 కోట్లకు చేరుకుంది.
ఈ బ్రాండ్ దుస్తులు భారతదేశంతో పాటు విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ బిజినెస్ కలిసిరావడంతో సదరు కంపెనీని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విధంగా అలియా భట్ సినిమాని మించిన బిజినెస్ వుమెన్‌గా సక్సెస్ అవుతోంది.