Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలిమినేట్ చేస్తారా? బిగ్ బాస్-2పై మాధవీ లత ఫైర్

తెలుగు బిగ్‌బాస్-2 షోపై నటి మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్‌పై మాధవీలత మండిపడింది. ట్విట్టర్ ద్వారా బిగ్ బాస్ సీజన్‌-2పై ఫైర్ అయ్యింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్‌తో ప్రేక్ష

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (10:30 IST)
తెలుగు బిగ్‌బాస్-2 షోపై నటి మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్‌పై మాధవీలత మండిపడింది. ట్విట్టర్ ద్వారా బిగ్ బాస్ సీజన్‌-2పై ఫైర్ అయ్యింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్‌తో ప్రేక్షకుల ఓట్లకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. అమిత్ కంటే నూతన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినా అతడిని ఎలిమినేట్ చేయడం దారుణమని మాధవీలత పేర్కొంది. 
 
రీ ఎంట్రీ ఇవ్వడంతోనే నూతన్‌ను బయటకు పంపించారని మాధవీలత ఆరోపణలు చేసింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్‌తో ఇకపై ప్రేక్షకుల ఓట్లకు పెద్దగా విలువ ఉండదని అర్థమైందని తెలిపింది. కేవలం షోను చూసి ఆనందించడానికే పరిమితం కావాలని మాధవీలత సూచించింది.
 
కాగా, బిగ్‌బాస్‌ హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. సామాన్యుడి కోటాలో హౌస్‌లోకి వచ్చిన గణేశ్ శనివారం ఎలిమినేట్ కాగా, ఆదివారం నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
 
సామాన్యుడి కోటాలో హౌస్‌లో అడుగుపెట్టిన గణేశ్, నూతన్ నాయుడులలో నూతన్ ఓసారి ఎలిమినేట్ అయి, రీ ఎంట్రీ ఇవ్వగా, గణేశ్ సెలబ్రిటీలకు ధీటుగా 84 రోజులు హౌస్‌లో ఉండి సత్తా చాటాడు. కానీ సామాన్యుడి హోదాలో నూతన్ హౌస్ నుంచి వెలుపలికి వచ్చేయడంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో కేవలం సెలెబ్రిటీలు మాత్రమే వున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments