Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన పిన్నిగారు?

ప్రముఖ టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌ రెండో సీజన్‌ ప్రేక్షకుల మద్దతుతో దూసుకెళుతోంది. అయితే, బిగ్‌బాస్ హౌస్‌ నుంచి నాలుగోవారం ఎలిమినేటయ్యే కంటెస్టెంట్‌ ఎవరో తేలిపోయింది. ఎన్నడూ లేనివిధంగ

Advertiesment
Anchor Shyamala
, ఆదివారం, 8 జులై 2018 (11:48 IST)
ప్రముఖ టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌ రెండో సీజన్‌ ప్రేక్షకుల మద్దతుతో దూసుకెళుతోంది. అయితే, బిగ్‌బాస్ హౌస్‌ నుంచి నాలుగోవారం ఎలిమినేటయ్యే కంటెస్టెంట్‌ ఎవరో తేలిపోయింది. ఎన్నడూ లేనివిధంగా ఈ సారి ఎలిమినేషన్‌ ప్రక్రియకు ఎక్కువ మంది నామినేట్‌ అయ్యారు. తొలి రెండు వారాల్లో సామాన్యులైన సంజనా, నూతన నాయుడులు హౌస్‌ నుంచి నిష్క్రమించగా.. గత వారం కిరీటి దామరాజు ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ దఫా హౌస్‌లో పిన్నిగారుగా గుర్తింపు పొందిన శ్యామల నిష్క్రమించింది.
 
నిజానికి ఈ దఫా ఎలిమినేట్ అయ్యే వారిలో శ్యామలతో పాటు కౌశల్‌, బాబుగోగినేని, నందిని రాయ్‌, దీప్తీ, గణేశ్‌, గీతా మాధురిలు ఇలా చాలా మంది ఉన్నారు. కానీ, శుక్రవారం ఎపిసోడ్‌లో కామన్‌ మ్యాన్‌ గణేశ్‌తో పాటు, సింగర్‌ గీతా మాధురి ప్రొటెక్ట్‌ అయినట్లు హోస్ట్‌ నాని ప్రకటించాడు. 
 
ఓ సామాన్యుడు హౌస్‌లోఉండాలనే ఉద్దేశంతో ప్రేక్షకులు గణేశ్‌కు మద్దతు తెలుపగా.. గీతా మాధురి సోషల్‌ మీడియా క్యాంపైన్‌తో గట్టెక్కినట్లు తెలుస్తోంది. ఆమెకు మద్దతుగా జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఓ ప్రణాళికతో హౌస్‌లోకి వెళ్లినట్లు అర్థమవుతోంది. ఈ ఇద్దరు సేఫ్‌ అవడంతో ఎలిమినేట్‌ అయ్యేది ఎవరబ్బా? అని ప్రేక్షకుల తెగ ఆలోచించసాగారు. 
 
ఈ నేపథ్యంలో హౌస్‌లో వదినగా పిలిచే దీప్తియే ఎలిమినేట్‌ కావొచ్చనుకున్నారు. కానీ అలా జరగలేదు. హౌస్‌లో ఎలాంటి గొడవలు పెట్టకోకుండా.. అందరి మన్ననలు పొందిన పిన్నిగారే ఎలిమినేట్‌ అయ్యారు. అదేనండి హౌస్‌లో పిన్నిగారినిపించుకున్న యాంకర్‌ శ్యామలే ఈ వారం ఎలిమినేట్‌ అయ్యారు. ఈ విషయం ఆమె స్వయంగా తెలిపి.. బిగ్‌బాస్‌ ఆశలపై నీళ్లు చల్లారు. అసలే వీకెండ్‌.. ఎలిమిటయ్యేది ఎవరా? అనే ప్రేక్షకుల ఆతృతను క్యాచ్‌ చేసుకొని రేటింగ్స్‌ రాబట్టుకోవాలనుకున్న బిగ్‌బాస్‌ టీమ్‌కు శ్యామల చర్య మింగుడు పడటం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టార్‌ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సినీతార