Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టార్‌ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సినీతార

స్టార్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ ఓ సినీ తార పట్టుబడింది. హైదాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 5లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో ముంబైకి చెందిన భోజ్‌పురి నటి వ్యభిచారం చేస్తూ అడ్డంగా చిక్కింది. ఈమెతో ప

స్టార్‌ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సినీతార
, ఆదివారం, 8 జులై 2018 (11:32 IST)
స్టార్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ ఓ సినీ తార పట్టుబడింది. హైదాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 5లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో ముంబైకి చెందిన భోజ్‌పురి నటి వ్యభిచారం చేస్తూ అడ్డంగా చిక్కింది. ఈమెతో పాటు జానీ అనే మధ్యవర్తిని, ఓ విటుడుని పోలీసులు అరెస్టు చేశారు.
 
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన అంబుల జనార్ధన్‌ రావు అలియాస్‌ జానీ అనే వ్యక్తి సినీ హీరోయిన్లతో వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. ముఖ్యంగా, అందమైన సినీ తారలను ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి వారిని స్టార్‌ హోటళ్లలో బస చేయించి వ్యభిచారం చేయిస్తూ వచ్చాడు. ఈ హీరోయిన్ల వద్దకు వచ్చే ధనవంతుల పిల్లలు రోజుకు రూ.20 వేల నుంచి రూ.50 వేలు చొప్పున వసూలు చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... అతనిపై నిఘా పెట్టాడు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా భోజ్‌పురి నటిని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్టు పసిగట్టిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. శనివారం ఆ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు సినీ నటితో పాటు, జనార్ధన్‌రావు, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 40 వేల నగదు, 3 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న విటుడు పేరు మహేంద్ర శర్మ. ప్రభుత్వ ఉద్యోగి కావడం గమనార్హం. అతడి వద్ద జనార్ధన్‌ రావు రూ.20 వేలు తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వారిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు నటిని రెస్క్యూ హోంకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ్ మేన‌కోడ‌లు సుప్రియ గూఢ‌చారిలో న‌టించ‌డానికి కార‌ణం ఇదే