నాగ్ మేనకోడలు సుప్రియ గూఢచారిలో నటించడానికి కారణం ఇదే
అక్కినేని మనవరాలు, నాగార్జున మేనకోడలు సుప్రియ, పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుప్రియ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ... నటనకు గుడ్ బై చెప్పింది. ప్ర
అక్కినేని మనవరాలు, నాగార్జున మేనకోడలు సుప్రియ, పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుప్రియ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ... నటనకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన రూపొందే చిత్రాల నిర్మాణ బాధ్యతలను నిర్వర్తిస్తూ.. సక్సస్‌ఫుల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తుంది. అయితే... అందరికీ షాక్ ఇస్తూ సుప్రియ మళ్లీ నటించేందుకు తెర పైకి వస్తోంది.
అది కూడా అడివి శేష్ నటించిన గూఢచారి సినిమా ద్వారా. సుప్రియ నటించాలి అనుకుంటే... అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాల్లో నటించవచ్చు. అలా కాకుండా అడివి శేష్ సినిమాలో నటించడం ఏంటి అనేదే ప్రశ్న. అయితే.. దీనికి చెప్పే సమాధానం ఇందులో ఆమె పాత్ర నచ్చడం వలనే నటించారని. అంతలా గూఢచారిలో ఏముంది అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమాని ఆగష్టు 3న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. సుప్రియ రీ-ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.