Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ టైటిల్ చూస్తే లిక్కర్.. ఈ పోస్టర్ చూస్తే గన్స్ : "దేవదాస్" ఫస్ట్ లుక్

దివంగత సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో "దేవదాసు'' ఒకటి. ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా, దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తె

Advertiesment
ఆ టైటిల్ చూస్తే లిక్కర్.. ఈ పోస్టర్ చూస్తే గన్స్ :
, శుక్రవారం, 6 జులై 2018 (09:03 IST)
దివంగత సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో "దేవదాసు'' ఒకటి. ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా, దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పడు ఇదే టైటిల్‌తో మరో సినిమా రానుంది.
 
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ తన సొంత బ్యానర్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో 'కింగ్' నాగార్జున, నేచురల్ స్టార్ నానిలు హీరోలుగా నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. 
 
ఈ చిత్రానికి దేవదాస్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని జూలై 5వ తేదీన అధికారికంగా ప్రకటించారు. తన ట్విట్టర్ ఖాతాలో హీరో నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ పోస్ట్ చేశారు. ఇందులో "మీ అండ్ దాస్" అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చనున్నారు. 
 
దేవ క్యారెక్టర్‌లో నాని నటిస్తుండగా.. దాస్ పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు. నాగార్జున సరసన ఆకాంక్షా సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. "ఛలో" ఫేం రష్మిక మందన నానికి జోడీగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే 65 శాతానికిపైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న దేవదాస్ సెప్టెంబర్‌‌లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 
 
నిజానికి 'దేవదాస్' అనే టైటిల్ గుర్తుకు వస్తేనే చాలు మందు సీసాలు గుర్తుకొస్తాయి. అలాంటిది 2018 'దేవదాస్' టైటిల్ పోస్టర్‌లో మాత్రం తుపాకులు, బుల్లెట్లు ఉండటం చూస్తుంటే.. మూవీ వైవిధ్యంగా ఉంటుందనే విషయం ఇట్టే అర్థమైపోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'విత్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. ఐ వాజ్ ఇన్ సెవెన్త్ క్లాస్' : పవన్ ట్వీట్ వైరల్