Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

షూటింగ్ అయ్యాక ప్రత్యేకంగా కలుద్దామని అనేవాడు : ఆ హీరోపై దీక్షా పంత్ ఆరోపణలు

ధన్‌రాజ్ హీరోగా‌, దీక్షా పంత్ హీరోయిన్‌గా వచ్చిన చిత్రం "బంతిపూల జానకి". ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ దీక్షా పంత్ తెలుగు బిగ్‌బాస్ రియాల్టీషోలోకి వైల్డ్ ‌కార్డ్ ద్వారా ఎంట్రీ అయ్యింది. ఇపుడు ఎలిమినేట్

Advertiesment
Bigg Boss Telugu
, బుధవారం, 20 సెప్టెంబరు 2017 (05:59 IST)
ధన్‌రాజ్ హీరోగా‌, దీక్షా పంత్ హీరోయిన్‌గా వచ్చిన చిత్రం "బంతిపూల జానకి". ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ దీక్షా పంత్ తెలుగు బిగ్‌బాస్ రియాల్టీషోలోకి వైల్డ్ ‌కార్డ్ ద్వారా ఎంట్రీ అయ్యింది. ఇపుడు ఎలిమినేట్ అయింది. ఈ షో నుంచి ఎలిమినేట్‌ అయిన హీరోయిన్‌ దీక్షా పంత్‌ బయటకు వచ్చాక సంచలన ఆరోపణలు చేసింది. ఎంతసేపూ నేను తింటున్న సీన్స్‌, నిద్రపోతున్న సీన్స్‌, ఏడుస్తున్న సీన్స్‌ మాత్రమే చూపించడం నాకు చాలా బాధ కలిగించింది.. అంటూ బిగ్‌బాస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. బహుశా కావాలనే ఇదంతా చేశారేమో అని నిర్వాహకులపైనా అనుమానం వ్యక్తం చేసింది.
 
బిగ్‌బాస్‌ మీద మాత్రమే కాదు, షోలో కో-పార్టిసిపెంట్స్‌పైనా ఘాటైన ఆరోపణలతో విరుచుకుపడిందీ బ్యూటీ. మరీ ముఖ్యంగా ధన్‌రాజ్‌, 'బంతిపూల జానకి' సినిమా ద్వారా పరిచయమనీ, ఆ సినిమా షూటింగ్‌ జరుగుతున్న రోజుల్లో, షూటింగ్‌ అయిపోయాక, సాయంత్రం ప్రత్యేకంగా కలుద్దామని చెప్పేవాడనీ, ఆ యాటిట్యూడ్‌ తనకు నచ్చేది కాదనీ, అందుకే 'వర్క్‌' వరకు పరిమితమయ్యాను తప్ప, ధన్‌రాజ్‌తో క్లోజ్‌గా వుండలేకపోయానని దీక్షా పంత్‌ చెప్పింది. అవన్నీ మనసులో పెట్టుకుని, ధన్‌రాజ్‌ తన పట్ల బిగ్‌హౌస్‌లో దారుణంగా ప్రవర్తించేవాడని దీక్షా పంత్‌ ఆరోపణ చేసింది. 
 
అర్చన, హరితేజ తదితరులపైనా దీక్షా పంత్‌ ఆరోపణలు చేయడం గమనార్హం. మహేష్‌ కత్తినీ వదిలి పెట్టలేదు దీక్షా పంత్‌. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన తర్వాత కూడా తన మీద అర్చన అక్కసు వెల్లగక్కుతోందని దీక్ష ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్‌ రియాల్టీ షోలోకి దీక్ష వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ఎంట్రీ సంపాదించిన విషయం విదితమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అన్న' ఎన్టీఆర్ ఇచ్చిన డబ్బుతో నా ఇంటి పునాది... పరుచూరి(వీడియో)