డ‌బుల్ గేమ్ ఆడేవారే వ‌ల్లే `మా`కు చెడ్డ‌పేరు

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (12:24 IST)
Naresh
ఎక్క‌డైనా ఏ రాజ‌కీయ పార్టీలోనైనా డ‌బుల్‌గేమ్ ఆడేవారు వుంటారనేది తెలిసిందే. ఒక పార్టీలో వుంటూ అధ్య‌క్షుడిగా ప‌క్షాన నిల‌బ‌డతారు కొంద‌రు. మ‌ర‌లా వ‌చ్చేఏడాదికి ఇలా నిల‌బ‌డిన‌వారే కొత్తగా ఎన్నిక‌ల్లో నిల‌బ‌డేవారికి వ‌త్తాసు ప‌లుకుతారు. మ‌రి అంత‌కుముందు సూప‌ర్ అన్న‌వారు ఇప్పుడు ఎందుకు ప్లేట్ మార్చిన‌ట్లు. ఇది ప్ర‌జ‌ల‌కు తెలిసిందే. ఇప్పుడు అదే కాన్సెప్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో జ‌రుగుతుంది. ఒక‌ప్పుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ అధ్య‌క్షుడిగా కాక‌ముందు నుంచీ ఎవ‌రైతే అధ్య‌క్షుడుగా వుంటారో వారి ప్లాన‌ల్‌లో కొంద‌రు ఇత‌ర హోదాలో వుంటూ ఆ పాన‌ల్‌కు స‌పోర్ట్‌గా నిలుస్తారు. అలా సీనియ‌ర్ న‌రేశ్ అధ్య‌క్షుడిగా వున్న‌ప్ప‌టినుంచీ వున్న కొంత‌మంది ఇప్పుడు ప్లేట్ మార్చి ప్ర‌కాష్‌రాజ్ పాన‌ల్‌లో జేరారు. ఈ విష‌యం ప‌ట్ల ప్ర‌స్తుత అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేశ్ క‌ల‌త చెందారు.
 
జాబ్ క‌మిటీ చేశాం
న‌రేశ్ మాట్లాడుతూ, నేను అధ్య‌క్షుడిగా వున్న‌ప్పుడు ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాను. ప్ర‌తి స‌భ్యుడి ఇంటింటికి వెళ్ళి వారి బాగోగులు తెలుసుకున్నాం. ఫించ‌న్ ఏర్పాటు చేశాం. ఆరోగ్య భధ్ర‌త క‌ల్పించాం. జీవిత రాజ‌శేఖ‌ర్, మా అమ్మ‌గారు విజ‌య‌నిర్మ‌ల‌, కృష్ణంరాజు ఇలా ప‌లువురు ముందుకు వ‌స్తే స‌భ్యుల కుటుంబంలో క‌ళ్యాణ లక్ష్మీ ప‌థ‌కం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్ర‌తి స‌భ్యుడికి ప‌ని క‌ల్పించాల‌నే జాబ్ క‌మిటీ ఏర్పాటు చేశాం. ఇవ‌న్నీ స‌భ్యులంద‌రికీ తెలిసిందేగ‌దా. 
 
భ‌వ‌నం గురించి కె.సి.ఆర్‌.తో మాట్లాడాం
అదేవిధంగా `మా`కు కొత్త భ‌వ‌నం ఏర్పాటుకు నేనే కె.సి.ఆర్‌.ను క‌మిటీతో క‌లిసి విన్న‌వించాం. ఈలోగా క‌రోనా వ‌చ్చింది. బ్రేక్ ప‌డింది. ఇప్పుడు కొత్త బిల్డింగ్ తెస్తామంటూ నిన్న ప్ర‌కాష్‌రాజ్ క‌మిటీలో స‌భ్యులే అన‌డం నాకు ఆశ్చ‌ర్యం క‌లిగింది. ఆయ‌న ప‌క్క వున్న పెక్కుమంది నా ఆధ్వ‌ర్యంలోని ఫోర్ క‌మిటీ స‌భ్యులే. ఇలా ఎలా మారిపోతారు మ‌నుషులు అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏదిఏమైనా ఎవరు ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారో వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నానంటూ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మలేషియాలో చదువుతున్నట్టుగా నమ్మించి ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆపై సూసైడ్...

తిరుపతి - నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ - మర ముగ్గురు మావోల హతం

ఐబొమ్మ వెబ్‌సైట్ - బప్పం టివీలు మూసివేత - యజమాని అరెస్టు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments