Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత ఆవిష్క‌రించిన చోర్ బజార్ లోని లిరికల్ సాంగ్

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (19:17 IST)
Akash Puri, Gehana Sippy
ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్చే సుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "చోర్ బజార్‌ సినిమా నుంచి సాంగ్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రంలోని 'నూనుగు మీసాల' లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు.
 
హీరోయిన్ సోలో సాంగ్ ఇది. ప్రియుడు తనను ఎలా ఆకర్షించాడు, అతని గురించి తానెంతగా  ఎదురు చూస్తుందో ఈ పాట ద్వారా చెబుతుంది నాయిక. "నూనుగు మీసాల పోరడు చూడు ఎదురుసూరీడే, నామీద నజర్ ఏసిండే,  రంగుల డబ్బాల గుండెను ముంచి ఎత్తుకపోయిండే, వాని గుండెల్ల దాచిండే, వాని బొమ్మ గీసి, మాటా ముచ్చట చెప్పుకున్న గాలిలో, వాణ్ని చేరితే చాలయ్యో, మళ్లొస్తడాని బాట మీద కూసోనున్న ఎవరన్నా జెర చెప్పిపోండయ్యో" ...అంటూ సాగుతుందీ పాట. ఈ పాటను సురేష్ బొబ్బిలి స్వరపర్చగా...కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. లక్ష్మీ మేఘన పాడారు. భాను కొరియోగ్రఫీచేశారు. "చోర్ బజార్" సినిమా త్వరలోనే థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
 
సాంకేతిక నిపుణులు - సినిమాటోగ్రఫీ - జగదీష్ చీకటి, సంగీతం - సురేష్
బొబ్బిలి, ఎడిటింగ్ - అన్వర్ అలీ, ప్రభు దేవా, ఆర్ట్ - గాంధీ నడికుడికర్,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం
సౌండ్ డిజైనర్ : సాయి మనీందర్ రెడ్డి, ఆడియో - లహరి, కాస్ట్యూమ్స్
డిజైనర్ - ప్రసన్న దంతులూరి, ఫైట్స్ - ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ - భాను,
పబ్లిసిటీ డిజైనర్ - అనిల్ భాను ,  స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో -
జీఎస్కే మీడియా,  మేకప్ - శివ, కాస్ట్యూమ్ చీఫ్ - లోకేష్, డిజిటల్ మీడియా
- వాల్స్ అండ్ ట్రెండ్స్, సహ నిర్మాత - అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ -
ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత - వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం - బి. జీవన్
రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments