Webdunia - Bharat's app for daily news and videos

Install App

షారూఖ్ ఖాన్ పాన్ ఇండియా మూవీ జవాన్

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (19:05 IST)
Shah Rukh Khan
బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా వరుస బ్లాక్ బస్టర్ విజయాల దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ''జవాన్'' టైటిల్ తో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించింది. అత్యున్నత స్థాయి తారాగణం, సాంకేతిక నిపుణులతో భారీ యాక్షన్ సీక్వెన్సులు గల ఈ పాన్ ఇండియా చిత్ర యావత్ సినీ ప్రేక్షకులకు ఒక గొప్ప వేడుకలా ఉండబోతుంది.
 
దక్షిణాదిలో రాజా రాణి, థేరి, మెర్సల్,  బిగిల్ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వచించిన అట్లీ .. ఇపుడు భారీ అంచనాలన్న 'జవాన్' తో తన మ్యాజిక్‌ను దేశ వ్యాప్తంగా చూపించబోతున్నారు  
 
అన్ని ఊహాగానాలకు స్వస్తి చెబుతూ..  'జవాన్' చిత్రాన్ని టీజర్ వీడియోతో  చిత్ర యూనిట్ ఈరోజు ప్రకటించింది. టీజర్ లో షారుఖ్ ఖాన్ గాయపడి, కట్టుతో రగ్గడ్ బ్యాక్ డ్రాప్ లో కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ జవాన్ లార్జర్ దెన్ లైఫ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వుంటుందని చెప్పకనే చెప్పింది. జవాన్ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో 2023 జూన్ 2  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 
ఈ చిత్రం గురించి షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ, “జ‌వాన్ భాషలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆస్వాదించే యూనివర్సల్ కథ. ఈ విలక్షణమైన  చిత్రాన్ని రూపొందించిన క్రెడిట్ దర్శకుడు అట్లీకి దక్కుతుంది. నేను   యాక్షన్ చిత్రాలను ఇష్టపడుతున్నాను కాబట్టి జావన్  నాకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. టీజర్ రాబోయే అద్భుతానికి చిన్న  గ్లింప్సె లాంటింది మాత్రమే'' అన్నారు    
 
'జవాన్‌'' దర్శకుడు అట్లీ మాట్లాడుతూ, “జవాన్‌లో యాక్షన్‌, ఎమోషన్, డ్రామా ఇలానీ విజువల్ వండర్ గా వుంటాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనుకుంటున్నాను. ప్రేక్షకులంతా కలసి ఎంజాయ్ చేయగల గొప్ప చిత్రాన్ని షారూఖ్ ఖాన్ తప్పా మరెవరూ అందించగలరు. మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రం ఉండబోతుంది'' అన్నారు.    
 
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో  గౌరీ ఖాన్ నిర్మిస్తున్న షారుఖ్ ఖాన్ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘జవాన్’ ఐదు భాషల్లో 2023 జూన్ 2న విడుదల కానుంది.
 
డుంకీ, పఠాన్, ఇప్పుడు జవాన్ ప్రకటనతో షారుఖ్ ఖాన్ వచ్చే ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సిద్ధమౌతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments