Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 5 March 2025
webdunia

ఉక్రెయిన్‌పై దండయాత్ర - 500 మంది రష్యా సైనికుల మృతి

Advertiesment
ఉక్రెయిన్‌పై దండయాత్ర - 500 మంది రష్యా సైనికుల మృతి
, శుక్రవారం, 4 మార్చి 2022 (08:34 IST)
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేపట్టిన రష్యా తన సైనికులను భారీగానే కోల్పోతోంది. దీనిపై తొలిసారి అధికారిక ప్రకటన చేసింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 500 మంది సైనికులను కోల్పోయినట్టు అధికారంగా ప్రకటించింది. మర 1600 మంది సైనికులు గాయపడినట్టు పేర్కొంది. అయితే, ఉక్రెయిన్ మాత్రం ప్రాణాలు కోల్పోయిన రష్యా సైనికుల సంఖ్య వేలల్లో ఉంటుందని వెల్లడించింది. ఈ వార్తలను రష్యా కొట్టివేస్తూ 500 మంది చనిపోయారంటూ ఓ ప్రకటన చేసింది. 
 
మరోవైపు, గత 9 రోజులుగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా బలగాలకు ఇపుడే పట్టు చిక్కుతుంది. ఉక్రెయిన్‌లోని కీలకమైన ఖేర్సన్ ఓడరేవును పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నట్టు రష్యా ప్రకటించింది. 
 
ఈ ఓడరేవును సొంతం చేసుకుని తీరంతో దేశానికి సంబంధాలు తెగిపోయేలా చేసేందుకు వారం రోజులుగా చేస్తున్న రష్యా ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. అంతేకాదు, ఓడరేవు పాలనా యంత్రాంగాన్ని కూడా రష్యా అదుపులోకి తీసుకున్నట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
 
మరియుపొల్, ఖర్కివ్ నగరాలను కూడా రష్యా దిగ్బంధించింది. ఈ నగరంలోకి చొచ్చుకుపోయేందుకు రష్యన్ దళాలు మరింతగా ప్రయత్నిస్తున్నాయి. రాకెట్లు, క్షిపణుల దాడులను ముమ్మరం చేశాయి. 
 
మరోవైపు, ఉక్రెయిన్‌లోని చెర్నిహైవ్‌లోని ఆసుపత్రిపై రెండు క్రూయిజ్ క్షిపణులు దాడిచేశాయి. ఇక్కడ జరిగిన ప్రాణ, ఆస్తినష్టం గురించి తెలియాల్సి ఉంది. కీవ్, ఖర్కివ్‌లపైనా దాడులు జరుగుతున్నాయి. మరియుపొల్ పాఠశాల సమీపంలో ఫుట్‌బాల్ ఆడుతున్న వారిపైనా రష్యన్ బలగాలు బాంబులు కురిపించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫలించని రెండో దశ చర్చలు - భీకరంగా సాగుతున్న ఉక్రెయిన్ - రష్యా పోరు