Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉక్రెయిన్‌పై దండయాత్ర - రష్యా సైనిక జనరల్ హతం!!

Advertiesment
ఉక్రెయిన్‌పై దండయాత్ర - రష్యా సైనిక జనరల్ హతం!!
, గురువారం, 3 మార్చి 2022 (19:00 IST)
ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఎనిమిది రోజులుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై పట్టు సాధించేందుకు రష్యా శాయశక్తులా పోరాడుతుంది. కానీ, ఉక్రెయిన్ బలగాలు, ప్రజలు తమ దేశ భూభాగాన్ని కాపాడుకునేందుకు తమ ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నారు. దీంతో రష్యా బలగాలకు ముచ్చెమటలు పోస్తున్నాయి. 
 
ఈ క్రమంలో భాగంగానే ఉక్రెయిన్ సేనలు జరిపిన దాడుల్లో రష్యా సైనిక జనరల్ ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈయన పేరు మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్ స్కీ. ఉక్రెయిన్ దాడుల్లో ఈయన ప్రాణాలు కోల్పోయినట్టు యూరప్‌కు చెందిన అతిపెద్ద మీడియా సంస్థ నెక్ట్సా వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు పోరు ప్రారంభించిన తర్వాత జనరల్ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
మరోవైపు, ఉక్రెయిన్‌లో తాము ఎవరిపై పోరాడో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఉక్రెయిన్ బలగాలకుతోడు ఆ దేశ ప్రజలు మొక్కవోని ధైర్యం, పట్టుదలతో పోరాడుతూ తమ భూభాగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రష్యాకు చెందిన మేజర్ జనరల్ హతం కావడం రష్యా బలగాల ఆత్మస్థైర్యం బలహీనపరిచేలా చేస్తుందని యుద్ధ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యాయ వ్యవస్థ నిద్ర పోతుందా?: మోదుగుల సంచలన వ్యాఖ్యలు