ముంబై బాంద్రా ప్రాంతంలోని 'జివేష్ బిల్డింగ్'లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ నివాసం 'మన్నత్'కు అత్యంత సమీపంలో ఈ భవనం ఉంది.
ఇక జివేష్ బిల్డింగ్ 21అంతస్తుల భవనంలో.. 14వ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. లెవల్-2 ఫైర్ యాక్సిడెంట్‌గా గుర్తించిన అధికారులు.. 8 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదం నుంచి ఆరుగురు వ్యక్తుల్ని, ఓ పెంపుడు కుక్కను కాపాడారు పోలీసులు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేక ఇంట్లోనే అగ్నిప్రమాదం జరిగిందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగితే మాత్రం సదరు భవనం నిర్మించిన బిల్డర్‌పై కఠిన చర్యలకు ముంబయి మహానగర పాలక సంస్థ సిద్ధమవుతోంది.
ఈ ఘటనపై షారూక్ స్పందించాడు. 'ఇంట్లో మంటలు చెలరేగాయి. ఎలా జరిగిందో తెలియదు. అయితే ఇంట్లో అంతా సేఫేనని షారూఖ్ చెప్పాడు. అన్ని డిపార్టుమెంట్స్ వెంటనే స్పందించినందుకు థాంక్స్' అంటూ షారుక్ ఖాన్ శుక్రవారం తెల్లవారు ఝామున ట్విట్టర్లో ట్వీట్ చేశారు.