Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొన్ని అత్యాచారాలు అలా జరిగిపోతుంటాయ్.. ఏం చేయలేం .. మంత్రి తానేటి

taneti vanitha
, బుధవారం, 4 మే 2022 (09:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలికాలంలో వరుసగా అత్యాచారాలు జరిగిపోతున్నాయి. అయినప్పటికి మంత్రులకు, పోలీసులకు చీమకుట్టినట్టుగా కూడా లేదు. పైగా, ఈ అత్యాచార ఘటనలపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమై చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కొన్ని అత్యాచార ఘటనలు అలా జరిగిపోతుంటాయి.. వాటిని మనం ఏమీ చేయలేము అని అన్నారు. 
 
గుంటూరులో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రేపెల్లె అత్యాచార ఘటనపై స్పందించారు. రేపల్లె రైల్వే స్టేషన్‌లో ఉన్న మహిళను అత్యాచారం చేసేందుకు దుండగులు రాలేదన్నారు. కానీ, మద్యం మత్తులో ఉన్న వారు డబ్బు కోసం బాధితురాలి వద్దకు వచ్చి ఆమె భర్తపై దాడి చేశారని చెప్పారు. పైగా, భర్త తనను రక్షించుకునేందుకు వెళ్లినపుడు నిందితులు ఆమెను నెట్టేసే విధానం, బంధించే విధానంలోనే అత్యాచారానికు గురైనట్టు ప్రత్యక్షంగా చూసినట్టు మంత్రివర్యులు వివరించారు. 
 
పైగా, పేదరికం వల్లో, మానసిక పరిస్థితుల వల్లో అప్పటికప్పుడు అనుకోని రీతిలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని అన్నారు. ఆమెపై అత్యాచారానికి, పోలీసు సిబ్బంది కొరతకు సంబంధమే లేదన్నారు. కాగా, అత్యాచార ఘటనలపై మంత్రి వరుసగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శల జడివాన కురుస్తోంది. గతంలో కూడా తల్లిదండ్రులు సక్రమంగా లేకపోవడం వల్లే పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైబర్ నేరగాడి చేతిలో మోసపోయిన వైకాపా ఎంపీ - రూ.97 వేలు మాయం