Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగార్జునకు చెక్: బిగ్ బాస్ 6 హోస్ట్‌గా సమంత?

Advertiesment
samantha
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మరింత యాక్టివ్‌గా మారింది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గురించి తాజా సమాచారాన్ని షేర్ చేస్తూ ఉంటుంది. 
 
తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఒకటి తెగ వైరల్ అయ్యింది. అయితే ఆ పోస్ట్ ఎవరికి వర్తిస్తుందో అంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ జరుగుతోంది.  
 
బుల్లితెర మీద బిగ్ బాస్ రియాల్టీ షో స్టార్ట్ అయ్యాక ఫస్ట్ సీజన్‌లో ఎన్టీఆర్, రెండవ సీజన్‌లో నాని హోస్ట్‌గా వచ్చారు. ఇక తర్వాత మూడో సీజన్ నుంచి నాగార్జున ఆ షోలో హోస్ట్ గా ఉంటున్నారు. బిగ్ బాస్ ఓటిటికి కూడా హీరో నాగార్జుననే హోస్ట్‌గా చేశాడు. 
 
కానీ నాగార్జునకు ఫస్ట్ వచ్చినప్పుడు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. అభిమానులకు ఆయన క్రేజ్ అంతగా నచ్చడం లేదు. దీంతో వచ్చే సీజన్‌కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడం లేదని తెలుస్తోంది. 
 
నాగార్జునకు బదులు ఆయన మాజీ కోడలు సమంతను హోస్టుగా తీసుకువచ్చేందుకు బిగ్ బాస్ యూనిట్ కసరత్తులు చేస్తోంది. ఈ కారణంతోనే సమంతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కమింగ్ సూన్ అనే పోస్టును షేర్ చేసింది. అయితే సమంత హోస్ట్ అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ త‌న కుమార్తె శ్రీలు గురించి ఏంచెప్పాడంటే?!