Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రౌడీబాయ్ విజయ్ దేవరకొండతో సమంత లిప్‌లాక్?

Advertiesment
khushi movie still
, శనివారం, 21 మే 2022 (12:51 IST)
టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండతో హీరోయిన్ సమంత లిప్‌లాక్ సీన్లలో మునిగిపోయినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ పేరుతో రూపొందే ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా కాశ్మీరులో జరుపుకుంటుంది. కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథ ఇది. 
 
ఇందులో సామ్‌ సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతిగా, విజయ్‌ స్టైలిష్‌ అబ్బాయిగా కనిపించనున్నట్లు ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తే తెలుస్తోంది. ఇంటెన్స్ ప్రేమకథగా సిద్ధమవుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 
 
ఈ సినిమాలో విజయ్‌ - సమంతల మధ్య ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, కథ డిమాండ్‌ చేయడంతోనే దర్శకుడు ఈ సన్నివేశాలు సృష్టించారని, దానిని అర్థం చేసుకున్న నటీనటులు ఓకే చేశారని వార్తలు బయటకువచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు అందిస్తున్నారు.
 
ఇదిలావుంటే, 'ఖుషి' చిత్రీకరణ కారణంగా గత కొన్నిరోజులుగా కాశ్మీర్‌లోనే ఉంటోన్న సమంత.. ఆ ప్రాంతంలోని ప్రకృతి అందాలకు మనసుపారేసుకున్నారు. కాశ్మీర్‌వాసుల జీవనశైలిని తెలియజేసేలా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. 'కశ్మీర్‌.. ఇక, నిన్ను ఎప్పుడు తలచుకున్నా నా పెదవులపై చిరునవ్వు విరబూస్తుంది' అంటూ రాసుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిశ్శబ్ద పాటల విప్లవం సిరివెన్నెల - వెంకయ్య నాయుడు