Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిపీట్ కానున్న లైగర్ కాంబో.. ఫోటోస్ ఇవే

Advertiesment
South
, బుధవారం, 30 మార్చి 2022 (09:59 IST)
vijay Devarakonda
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మి సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. 
 
'లైగర్' విడుదలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉండగానే ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రానున్నట్లు అనౌన్స్ చేశారు.  
 
'మరో కొత్త మిషన్ లాంచ్‌కి అంతా సిద్ధమైంది.. విధ్వంసకర కాంబినేషన్.. మార్చి 29, మధ్యాహ్నం 2.20గంటలకు మిషన్ లాంచ్..' అని పూరి జగన్నాథ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. 

Vijay Devarakonda
 
ఇదే పోస్టర్‌ను విజయ్ దేవరకొండ, చార్మి తమ ట్విట్టర్, ఇన్‌స్టా ఖాతాల్లో షేర్ చేశారు. ఆ పోస్టర్‌ని బట్టి చూస్తే... వైమానిక నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమా 'జన గణ మన' ప్రాజెక్ట్ ఇదే అయి ఉండొచ్చునన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
 
ఇప్పటికైతే ఈ ప్రాజెక్ట్ ఏంటనేది చెప్పకుండా పూరి, విజయ్ అందరినీ సస్పెన్స్‌లో పెట్టారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'లైగర్' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 

Vijay Devarakonda
 
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది. 

Vijay Devarakonda
 
ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న లైగర్‌ను పూరి జగన్నాథ్-కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుణ్ కెరీర్లో గని బెస్ట్ మూవీగా నిలుస్తుంది - నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్ద