Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ త‌న కుమార్తె శ్రీలు గురించి ఏంచెప్పాడంటే?!

Advertiesment
Prithvi, Srilu
, గురువారం, 2 జూన్ 2022 (10:22 IST)
Prithvi, Srilu
థర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ త‌న కుమార్తె గురించి ఇలా తెలియ‌జేస్తున్నారు. మా అమ్మాయి శ్రీలు హోటల్ మేనేజ్మెంట్ చేసి మలేసియా వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంది కానీ అమ్మాయి డాన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి అన్ని నేర్చుకుంది. నటనపై మక్కువతో సీన్స్ చూసి అనుకరించేది.


అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాము కానీ కుదరలేదు. చివరికి నా స్నేహితుడు కుమారుడు క్రాంతి హీరోగా ముగ్గురు పాట్నర్స్ కలిసి మా అమ్మాయి హీరోయిన్‌గా సినిమాను నిర్మించారు. ఒక టీమ్ వర్క్ గా కథ రాసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 
సీనియర్ రైటర్ ఘటికాచలం గారు ఈ సినిమాకు బాగా హెల్ప్ చేశారు. అమ్మాయి,  అబ్బాయి ప్రతిభ చూశాక నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను తీశారు, పాటలన్ని అద్భుతంగా వచ్చాయి. లొకేషన్లో మాకు సహకరిస్తున్న కమల్ గారు అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పై మంచి అనుభవం కిలిగిన గౌతమ్ రెడ్డి, కెమెరామెన్ శివకుమార్ రెడ్డి ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు, అతను స్ట్రీట్ చిల్డ్రన్‌ను చదివిస్తున్నాడు, చాలా గొప్ప విషయం ఇది. 

 
సంగీత్ ఆదిత్య గారు మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా సాంగ్స్ విడుదల చెయ్యబోతున్నాము. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో. శ్రీ పిఆర్ క్రియేషన్స్ ద్వారా ఈ కొత్త రంగుల ప్రపంచం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 
ఈ సినిమాను తన ప్రతిభతో అద్భుతంగా తెరకెక్కిస్తున్న దర్శకుడికి నా కృతజ్ఞతలు. అతను రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమాను తీస్తున్నారు. త్వరలో ఆయన పేరు, వివరాలు మీకు తెలుపుతామని పృద్వి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘనంగా జయహో రామానుజ మూవీ ఫస్ట్ లుక్