Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఘనంగా జయహో రామానుజ మూవీ ఫస్ట్ లుక్

Advertiesment
Jayaho Ramanuja look
, బుధవారం, 1 జూన్ 2022 (19:44 IST)
Jayaho Ramanuja look
సుదర్శనం ప్రోడక్షన్స్ బ్యానర్ లో దర్శక నిర్మాత,మరియు నటుడు డా||లయన్ సాయి వెంకట్  నిర్మిస్తున్న చిత్రం “జయహో రామానుజ. ఈ మూవీ ఫస్ట్ లూక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ ఆవిష్కరణ మహోత్సవం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా  జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత వడ్లపట్ల మోహన్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ ప్రసన్న కుమార్, టి ఎఫ్ సి సి ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ, సెన్సార్ బోర్డు మెంబర్ అట్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
 
చిత్ర నిర్మాత దర్శకుడు నటుడు లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ: 11వ శతాబ్దంలో భగవత్ రామానుజుల యొక్క జీవిత చరిత్ర ఆధారంగా హైదరాబాద్, శ్రీరంగం, బెంగళూరు ప్రాంతంలో షూటింగ్ జరిపాం ఇప్పటి వరకు  50 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. 
 
జూన్ 15 నుండి మూడవ షెడ్యూలు ప్రారంభించి బెంగళూర్, తిరుపతిలలో రామానుజులు X మహారాజుల సన్నివేశాలు, తిరుమల తిరుపతి దేవస్తానం విశిష్ఠత పై చిత్రీకరణ చేయనున్నాము. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా నిర్మిస్తున్నాము. మొదటి పార్ట్ ను దసరాకు రిలీజ్ చేసి రెండవ పార్ట్ ను మే 5న రామానుజ జయంతి సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము అని అన్నారు 
 
రామానుజుల జీవిత చరిత్ర ను అందరికీ తెలిసేలా సినిమాగా తెరకెక్కిస్తున్న లయన్ సాయి వెంకట్ ప్రయత్నం అభినందనీయం అని వేడుకకు హాజరైన అతిథులు కొనియాడారు
 
నిర్మాతలు :  సాయి ప్రసన్న,  ప్రవళ్లిక 
నటులు:- డాక్టర్ లయన్  సాయి వెంకట్ రామానుజ చార్యులు గా,  జో శర్మ( మిస్ అమెరికా) హిరోయిన్ గా, హిరో సుమన్, ప్రవళ్లిక, మనోజ్ కుమార్, అప్పం పద్మ, ఆశ్వాపురం వెణుమాధవ్ .

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోపీచంద్ పక్కా కమర్షియల్ అందాల రాశీ పాటకు అనూహ్య స్పందన