Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామానుజ పార్థివదేహం శ్రీరంగంలో ఇంకా ఉంది - లయన్ సాయి వెంకట్

రామానుజ  పార్థివదేహం శ్రీరంగంలో ఇంకా ఉంది - లయన్ సాయి వెంకట్
, శనివారం, 29 జనవరి 2022 (18:21 IST)
Jayaho Ramanuja logo launch
సుదర్శనం హేమలత సమర్పణలో సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ ప్రధాన పాత్రలో సుదర్శనం సాయి ప్రసన్న, సుదర్శనం ప్రవళీకలు నిర్మిస్తున్న రామానుజం జీవిత చరిత్రే  "జయహో రామానుజ".ఈ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది.ఈ కార్య క్రమానికిముఖ్య అతిథిలుగా వచ్చిన తిరుమలై కందాడై రామానుజ మఠం పీఠాధిపతి, జగద్గురు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణాచార్యులు గారు "జయహో రమానుజ" చిత్ర టైటిల్ లోగోను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోదండ రామాచార్యులు(తిరుమలై కందాడై రామానుజ మఠం ఉత్తర పీఠాధిపతి),టి.యఫ్.పి.సి ప్రధాన కార్యదర్శి మోహన్ వడ్ల పట్ల మరియు చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. 
 
అనంతరం జగద్గురు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణాచార్యులు (తిరుమలై కందాడై రామానుజ మఠం పీఠాధిపతి) మాట్లాడుతూ.. 'రామానుజం గారి జీవిత చరిత్ర తీస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఎందుకంటే మా మఠం కూడా తిరుమలై కందాడై రామానుజ మఠం.13 వ శతాబ్దంలో రామానుజం గారు తిరుపతి వచ్చినప్పుడు ఆయన స్థాపించినదే ఈ మఠం..అయన తిరుమలలో నాలుగు మఠంలను స్థాపించాడు.  ఆసూర్య మఠం, శ్రీ వస్తు మఠం, పరవస్తు మఠం, కందాడై మఠం లను స్థాపించి బ్రాహ్మణులను నాలుగు తెగలుగా విభజించాడు. వారే అయ్యర్, జీయర్, నంబి ,ఆచార్య. ఈ ఆచార్య మఠమైన తిరుమలై కందాడై రామానుజ మఠంకు ఆయన వారసున్నే మఠాధిపతి చేశారు. ఆయన పరంపరలో నేను 17వ పీఠాధిపతిని.ఈ మఠంకు 12 దేశాల్లో శాఖలున్నాయి. ఇలా మేము రామానుజన్ గారి గొప్ప తనాన్ని వారి జీవిత చరిత్రను తెలియజేస్తున్నాం.అయితే  నటుడు, దర్శక, నిర్మాత సాయి వెంకట్ గారు రామానుజన్ గారి జీవిత చరిత్ర పై సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వారికి మేము ఆయన గురించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.దీంతో ఆయన గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు ఈ సినిమా ద్వారా తెలుస్తాయి అని కోరుకుంటూ ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
కోదండ రామాచార్యులు(మూర్తి స్వామి) మాట్లాడుతూ.. రామానుజం స్వామి చరిత్ర తీసుకురావడానికి ఇప్పటి వరకు ఎవరు  సాహసించలేదు. అటువంటిది ఇప్పుడు సాయి వెంకట చేస్తున్నారు ఈ "జయహో రామానుజ" చిత్రం మహోన్నతమైన గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు 
టి.యఫ్.పి.సి ప్రధాన కార్యదర్శి మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రం తీస్తున్న సాయి వెంకట్ కు ధన్యవాదాలు. ఆయనకు నేను సపోర్ట్ గా వుంటూ ఈ సినిమాకు నేను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు.
 
చిత్ర దర్శకుడు,నటుడు సాయి వెంకట్ మాట్లాడుతూ, ఈ  సినిమాకు  మూడు సంవత్సరాలుగా పరిశోధన చేశాను. భగవత్ రామానుజన్ చరిత్ర తీయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే  స్వయంగా ఆదిశేషుడే మన భగవత్ రామానుజుడు గా అవతరించాడు.శ్రీమన్నారాయణుడు యొక్క ఆదేశంతో ఆదిశేషుడు కలియుగంలో జన్మించి ఎంతోమందిని చైతన్య పరచిన విప్లవకారి ఆయన. రామానుజాచారి కథ చాలామందికి తెలియదు. ఇప్పుడు చిన్న జీయర్ స్వామి గారు హిందూత్వం పైన ఎంతో గొప్పగా విశేషమైన కృషి చేసి ప్రపంచంలోనే అతిపెద్ద రామానుజ స్టాచ్యు 180 అడుగుల ఎత్తుతో నిర్మించి  ప్రధానమంత్రి, రాష్ట్రపతి అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులతో  ఫిబ్రవరి 5న ప్రారంభిస్తున్నారు. ఈ సినిమా తీసే క్రమం లో ఆయనను కలవడం జరిగింది.ఇలా ఎంతోమంది పీఠాధిపతులను కలిసినప్పుడు వారు రామానుజాచార్యులు చేసినవి ఎన్నో ఉన్నాయి అందులో 10% చూపించిన చాలు అని చెప్పడం జరిగింది. భగవత్ రామానుజాచార్యులు శ్రీరంగం లో జన్మించి మేల్ కోటి లో ఆయన చివరి ప్రయాణం చేసి తిరుమల దేవస్థానం రూప కల్పనలో ఆయన ప్రత్యేకత ఉంది.ఆయన ఒక రహస్యం.ఆయన మరణించి ఇప్పటికి 1005  సంవత్సరాలు అయింది. కానీ నేటికీ ఆయన  పార్థివదేహం శ్రీరంగంలో ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేనిది,ఏమీ జరగనిది,ఏ రాజులు, ఏ లక్షల కోట్ల అధిపతులలో కూడా జరగనిది ఒక దేవుడే ఆ రూపమని చెప్పడానికి శ్రీరంగంలో ఈనాటికీ ఈ రోజుకి ఆయన పార్థివ దేహం ఉన్నది అంటే మీడియాకు కూడా  ఆశ్చర్య పోతుంది. 
 
ఈ విషయాన్ని కూడా మేము ఇందులో చూపించ బోతున్నాం. రామానుజం గారి విశిష్టత ను చూపించబోతున్న మాకు రెండు సినిమాలు తీసేంత సబ్జెక్ట్ రావడం వల్ల మొదట పార్ట్ 1 ను రిలీజ్ చేసిన 5 నెలల తర్వాత రెండవ  భాగాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. "అన్నమయ్య" తర్వాత ఇంత మంచి గొప్ప చిత్రాన్ని నిర్మిస్తున్నారని  తిరుమల తిరుపతి దేవస్థానం వారు అప్రిసెట్ చేస్తూ తిరుమలలో షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు చిన్న తనం నుంచే రామానుజన్ అంటే ఒక ఇంప్రెస్స్ ఉండేది.ఇప్పుడు తన కథతో నేను సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఇప్పటివరకు 25% వరకు షూటింగ్ చేశాము. ఇందులో ఆరు పాటలు, 11 శ్లోకాలు ఉంటాయి. హైదరాబాద్ తిరుపతి తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది.శ్రీ శ్రీనివాస్ సాంగ్ ను షాద్ నగర్ లోని పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో షూటింగ్ చేయబోతున్నాం.ఆ తర్వాత ఫిబ్రవరి 25 మార్చి 15 వరకు తిరుపతిలో ఆ తర్వాత తమిళనాడు లోని శ్రీరంగం, కాంచి,పేరంబదుర్, బెంగళూర్లోని మేల్ కోటి ఇలా మూడు రాష్ట్రాల్లో షూటింగ్ చేయబోతున్నాం.ఈ సినిమాకు నేను దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఇలా అన్ని బాధ్యతలు తీసుకోలేను కాబట్టి నా ముగ్గురు కూతుర్లలో ఇద్దరమ్మాయిలు నిర్మాతలుగా బాధ్యతలు వ్యవహరించడం జరుగుతుంది. ఇంకొక అమ్మాయి పద్మ ను సింగర్ గా ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నాం.ఇలా మేము చేయబోతున్న "జయహో రామానుజ" సినిమాకు మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుతూ త్వరలో ఆడియో ఫంక్షన్ ను చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.
 
నటి జో శర్మ మాట్లాడుతూ..  తెలుగమ్మాయి అయిన నేను అమెరికా లో చదువుకొని అక్కడ పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను. అయితే నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్సు, యాక్టింగ్ పై  ఫ్యాషన్ ఉండటం వల్ల అక్కడే నేను డ్యాన్స్ & యాక్టింగ్ స్కూల్ ప్రారంభించాను. ఇంత మంచి ప్రాజెక్టు లో నేను చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. సాయివెంకట్ గారు నాకు చాలా గైడ్ గైడ్ లైన్స్ ఇచ్చారు.తను డైరెక్టర్ గా యాక్టర్ గా ప్రొడ్యూసర్ గా చేయడం గొప్ప విషయం.నాకు ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్గింది అన్నారు 
 
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రవీణ్, అప్పం పద్మ ,అశ్వాపురం వేణు మాధవ్, తదితరులు పాల్గొని ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన రామానుజం గారి బయోపిక్ లోనటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు. 
 
నటీనటులు
లయన్ సాయి వెంకట్,జో శర్మ,అశ్వాపురం వేణు మాధవ్, అప్పం పద్మ తదితరులు 
 
సాంకేతిక నిపుణులు
ప్రెజెంట్స్ : సుదర్శనం హేమలత 
బ్యానర్ : సుదర్శనం ప్రొడక్షన్స్ 
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టన్ : లయన్ సాయి వెంకట్
నిర్మాతలు : సుదర్శనం సాయి ప్రసన్న,సుదర్శనం ప్రవళీక
పి.ఆర్.ఓ : సతీష్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎఫ్ 3 షూటింగ్ పూర్తి - ఏప్రిల్ 28న విడుదల