Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్లీజ్ ఆమెను ఆదుకోండి, దర్శకుడు రాజమౌళి రిక్వెస్ట్

Advertiesment
ప్లీజ్ ఆమెను ఆదుకోండి, దర్శకుడు రాజమౌళి రిక్వెస్ట్
, శనివారం, 29 జనవరి 2022 (16:08 IST)
మహమ్మారి కేన్సర్. ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి బారిన తన చిత్రం బాహుబలి కోసం పని చేసిన దేవికను ఆదుకోవాలంటూ స్టార్ డైరెక్టర్ రాజమౌళి అభ్యర్థిస్తున్నారు. తన ట్విట్టర్ పేజీలో రాజమౌళి తన చిత్రం కోసం పని చేసిన దేవిక ఆరోగ్య పరిస్థితిని తెలియజేసారు.

 
తన గత చిత్రం బాహుబలి సమయంలో దేవిక పోస్ట్ ప్రొడక్షన్స్ పనులకు కో-ఆర్డినేటర్‌గా పనిచేసారనీ, పనిపట్ల ఆమె అంకితభావం విలువైనదన్నారు. దేవిక ప్రస్తుతం బ్లడ్ కేన్సర్‌తో పోరాడుతున్నారనీ, ఆమె చికిత్సకు షుమారు రూ. 3 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఆమె ఆర్థిక పరిస్థితి రీత్యా ఆదుకోవాలంటూ రాజమౌళి ట్విట్టర్ ద్వారా విన్నవించారు.

 
దేవిక మధ్యతరగతి కుటుంబానికి చెందినవారనీ, ఆమెకి గతంలో కేన్సర్ సోకినప్పటికీ దాన్నుంచి బయటపడ్డారన్నారు. ఆమె కుమారుడు అరుదైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనీ, అతడికి వైద్యం చేయించుకునేందుకు ఆమె కష్టపడుతుండగా భర్త కిడ్నీ సమస్యతో కన్నుమూసినట్లు తెలిపారు. కుమారుడికి వైద్యం చేయిస్తుండగా ఆమెకి మళ్లీ బ్లడ్ కేన్సర్ తిరగబెట్టినట్లు వెల్లడించారు. దేవికను ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించాలని విజ్ఞప్తి చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో విజయ్‌కి మద్రాసు హైకోర్టులో ఊరట