Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకల్ నటీనటుల పొట్టకొడుతున్న టీవీ యాజమాన్యం: నాగబాబు ఫైర్

డీవీ
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (13:04 IST)
Nagababu
నాగబాబు కొణిదెల ఇటీవలు పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. కొద్దిరోజుల నాడు టీవీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ, మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మీకు సరైన పనిలేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ మీ ప్లేస్ లో కన్నడ భాషకు చెందిన నటీనటులు కొత్తగా టీవీ సీరియల్స్ లో రాజ్యమేలుతున్నారు. ఒకరకంగా మీ పొట్ట కొడుతుంది ఎవరో తెలుసుగదా.. అంటూ, మీరంతా ఒకటిగా టీవీ యాజమాన్యంపై మీ బాధలు తెలపండి. వినరు. మరోసారి చెప్పండి. చివరికి దీక్ష చేయండి. నేను కూడా వస్తాను అంటూ వ్యాఖ్యానించారు.
 
నేను టీవీ నిర్మాతగా నటీనటుల సాధక బాధలు తెలుసు. దర్శక నిర్మాతలు పేరుకు మాత్రమే. ఒక సీరియల్ కు పూర్తయ్యేవరకు ఎందరో మారిపోతుంటారు. నటీనటుల ఎంపిక కూడా దర్శకుడి చేతిలో వుండదు. టీవీ యాజమాన్యం చేతిలో వుంటుంది. అందుకే అందరూ వీటిపై పోరాడాల్సిన అవసరం వుంది.
 
అలా గతంలో మా టీవీ ఆఫీసుముందు పోరాటం చేశాం. కానీ అప్పటినుంచి మాకు రెడ్ కార్డ్ లాంటిది క్రియేట్ చేసి మాకు సీరియల్స్ లో అవకాశాలు ఇవ్వడంలేదనీ, మా బతుకులు చాలా దారుణంగా వున్నాయని ఓ నటుడు నాగబాబును ప్రశ్నించడంతో, నాకు తెలుసు మీ బాధలు. అందుకే నేనుకూడా మీ పోరాటంలో భాగస్వామ్యంఅవుతాను. అయితే అందుకు సమయం వుంది. ఆంధ్రలో ఎలక్షన్స్ అయ్యాక టీవీ పై ద్రుష్టిపెడతా అన్నారు. ఈలోగా టీవీ అసోసియేషన్ తరఫున మీరు పోరాటాలు చూస్తూనే వుండండి అంటూ సలహా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments