మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యుడిగా వుంటూ అక్కడి వ్యవహారాలు నచ్చక సభ్యత్వం నుంచి తప్పుకున్నాననీ మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు. ఇంతకకుముందు మురళీ మోహన్ తోపాటు పలువురు `మా` అధ్యక్షులుగా తమ పని బాగా చేశారు. ఆతర్వాత అంటే ఆమధ్య జరిగిన ఎన్నికల్లో నేను కొందరికి సపోర్ట్ గా నిలిచాను. చాలామంది మద్దతు తెలిపారు. ఏమయిందో ఏమిటో చివరికి వచ్చేసరికి అందరూ మారిపోయారు.
వారంతా కొన్ని ప్రలోభాలకు లోనయిట్లుగా అనిపించింది. దాంతో ఒక క్రమశిక్షణ అంటూ లేకుండా పోయింది. ఇష్టం వచ్చినట్లు మా తయారైంది. రెండేళ్ళుకు పైగా గెలిచిన కమిటీ వుంది. పనులు ఏమి చేసిందనేది పక్కన పెడితే, కాలపరిమితి అయినా ఇంకా ఎన్నికలు జరగలేదు. ప్రజాస్వామ్యంగా మా ఎన్నికలు జరగాలి. ఈ విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇందులో చాలామంది మా సభ్యులుకూడా వున్నారు. మీరు వారికి చెప్పండి. ఎన్నికలు జరిపించి కళాకారులను మంచి చేసేలా చర్యలు తీసుకోమని.. అంటూ నాగబాబు ధ్వజమెత్తారు.
టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రజతోత్సవ వేడుకలు బుధవారంనాడు అజీజ్ నగర్లో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పలు విషయాలు మాట్లాడారు. ఆయన మాటలకు అందరూ కరతాళధ్వ నులు చేశారు.