ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం చేతికొచ్చిన తర్వాత తండ్రి ఫొటోను పక్కన పడేశాడని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజల బతుకులను ఛిద్రం చేసిన వ్యక్తి అని దుయ్యబట్టారు. ఆస్తి కోసం సొంత తల్లిని, తోడబుట్టిన చెల్లిని గెంటేసిన స్వార్థపరుడని మండిపడ్డారు. సీఎం జగన్ ఒక సైకో అని, అద్భుత నటుడు అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.
రానున్న ఎన్నికల్లో జనసేన - టీడీపీదే విజయమని సర్వేలన్నీ చెపుతున్నాయని తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ... కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే అవి సహజ మరణాలు అని అసెంబ్లీలో చెప్పిన ఘనత జగన్‌దని ఫైర్ అయ్యారు. ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులను చెంప పగలగొట్టి.. కాలర్ పట్టుకుని తమ ప్రాంతానికి ఏం చేశారని ధైర్యంగా అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజలకు నష్టం కలిగించిన వారిని, భూ కబ్జాలు చేసే వారిని జనసేన-టీడీపీ అధికారంలోకి వచ్చాక చెవులు మెలేసి మరి జైలుకు పంపుతామన్నారు. పిల్లలు, యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని జనసేన-టీడీపీ కూటమికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని నాగబాబు పిలుపునిచ్చారు.