Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైగర్ నాగేశ్వరరావు కోసం లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్!

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (12:34 IST)
Anupam Kher
వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి తాజా అఫ్డేట్ వచ్చింది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత సినిమా కోసం వేసిన భారీ సెట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
 
ప్రస్తుతం ఈ సినిమా కాస్టింగ్ అదుర్స్ అనిపిస్తోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం లెజెండరీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు అనుపమ్ ఖేర్‌ను ఎంచుకున్నారు. టైగర్ నాగేశ్వరరావు నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ది కాశ్మీర్ ఫైల్స్‌లో అతను కూడా ఒక భాగం. అతను నాగేశ్వరరావు టీమ్‌లో చేరడం ద్వారా కాస్టింగ్ డిపార్ట్‌మెంట్ స్థాయిని మెరుగుపరచడమే కాకుండా హిందీ మార్కెట్‌కు కూడా సహాయపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. 
 
ఇకపోతే.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్.. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాబట్టి, నిర్మాత రాజీపడని బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
అలాగే టైగర్ నాగేశ్వరరావు పేరు మోసిన దొంగపై బయోపిక్ కావడం గమనార్హం. అంతేగాకుండా స్టువర్ట్‌పురం అనే గ్రామంలో 70లలో సెట్ వేయడం జరిగింది. ఈ చిత్రంలో రవితేజ బాడీ లాంగ్వేజ్, గెటప్ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ సినిమాలో మాస్ మహారాజ క్యారెక్టర్‌ అతని కెరీర్‌లో హైలైట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు.
 
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఆర్‌ మదీ ఐఎస్‌సి సినిమాటోగ్రాఫర్‌, జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments