Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

కార్తికేయ 2 లోని సాంగ్‌కు అనూహ్య స్పందన

Advertiesment
Nikhil, Anupama Parameswaran,
, మంగళవారం, 12 జులై 2022 (16:38 IST)
Nikhil, Anupama Parameswaran,
హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పై అద్భుతమైన స్పందన వచ్చింది. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ ఆకట్టుకుంటుంది. తాజాగా కార్తికేయ 2లోని 'నన్ను నేను అడిగా' వీడియో సాంగ్ విడుదలైంది. 
 
అడిగా నన్ను నేను అడిగా.. నాకెవ్వరు నువ్వని.. 
అడిగా నిన్ను నేను అడిగానే.. నిన్నలా లేనని..
నవ్వుతూ నన్ను కోసినావే గాయమైన లేకనే..
చూపుతో ఊపిరి ఆపినావే.. మార్చి నా కథ ఇలా..
నువ్వే కదా ప్రతీ క్షణం క్షణం పెదాలపై.. 
నీతో ఇలా ఇలా జగం సగం నిజం కదా.. అంటూ సాగే ఈ పాట చాలా వినసొంపుగా ఉంది. కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణ. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్భుతంగా చూపించారు సినిమాటోగ్రఫర్ కార్తికే ఘట్టమనేని. టెక్నీషియన్స్‌తో అద్బుతమైన ఔట్ పుట్ తీసుకున్నారు దర్శకుడు చందూ మొండేటి. కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ 2 అంచనాలు అందుకోవడం కాదు.. మంచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందూ. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం.  శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నారు ఈయన. ఈ చిత్రంలోని భావాన్ని ట్రైలర్ రూపంలో ద‌ర్శ‌కుడు చందు మొండేటి ప్రేక్ష‌కుల క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల కానుంది కార్తికేయ 2. 
 
నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు
 
టెక్నికల్ టీం:  క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్యం - చందు మెుండేటి,  బ్యాన‌ర్:  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌,  కొ-ప్రొడ్యూస‌ర్: వివేక్ కూచిభొట్లనిర్మాత‌లు: టి.జి విశ్వ ప్ర‌సాద్‌&అభిషేక్ అగ‌ర్వాల్‌, మ్యూజిక్: కాలభైరవ,  సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని,  ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్,
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ గురించి- సీక్రెట్ గాళ్‌ ఫ్రెండ్ గురించి రామ్ ఏమ‌న్నాడో తెలుసా!