Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగా - మాస్ కాంబినేషన్ - మెగా 154లో రవితేజ?

Advertiesment
chiru - raviteja
, శనివారం, 16 జులై 2022 (18:07 IST)
మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో మాంచి జోరుమీదున్నారు. ఆయన హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. "మెగా 154" అనే వర్కింగ్ టైటిల్ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్నారనే చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. 
 
ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఆయన సెట్స్‌లో అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. కారులో నుంచి దిగి నడుచుకుంటూ వచ్చిన రవితేజ.. చిరు క్యారావాన్‌ దగ్గరకు వచ్చి 'అన్నయ్యా' తలుపు కొట్టారు. 
 
'హాయ్‌ బ్రదర్‌' అంటూ క్యారావాన్‌లో నుంచి చిరు చేయి అందించగా రవితేజ కన్ను కొడుతూ లోపలికి వెళ్లారు. 'మెగా మాస్‌ కాంబో మొదలైంది'’ అంటూ బాబీ ఎండ్‌ కార్డ్‌ వేశారు.
 
క్లాస్‌ నుంచి మాస్‌ వరకూ అన్ని వర్గాల్లోనూ చిరంజీవికి అభిమానులు ఉన్నారు. ఇక మాస్‌ను మెప్పించేలా సినిమాలు చేస్తూ రవితేజ అలరిస్తున్నారు. వీరిద్దరూ ఒకే తెరపై కనిపిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 
 
రవితేజను 'బలుపు', 'పవర్‌' చిత్రాల్లో తనదైనశైలిలో చూపించిన బాబీ.. ఇప్పుడు చిరంజీవిని అంతకన్నా ఊరమాస్‌ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. 
 
కాగా, శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్న 'మెగా 154' పూర్తి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా బాబీ తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తీసుకురావాలని భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్తదనంతో తీస్తే ఆదరిస్తారని మరోసారి నిరూపించారు- వర్మ