ఇటీవలే  శ్రుతిహాసన్ తన ఆరోగ్యం గురించి చిన్న వీడియో ద్వారా తెలియజేస్తూ, మహిళలకు వచ్చే సమస్యే నాకు వచ్చింది. దాన్నించి నేను బయటబడ్డాను. త్వరలో షూటింగ్‌లో పాల్గొంటున్నానని తెలియజేసింది. తాజా సమాచారం మేరకు ఈరోజు అంటే శనివారంనాడు హైదరాబాద్ శివార్లో జరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి 154 సెట్‌లో హాజరైందని తెలిసింది. ఈ సందర్భంగా రావడంతోనే అక్కడి దర్శకుల టీమ్‌తో టేక్.. యాక్షన్ అంటూ అక్కడివారిని ఎంటర్‌టైన్ చేసిందట.
  
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఈ చిత్రానికి కె ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకుడు. ఈరోజు పాల్గొనే షెడ్యూల్‌లో  మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొననుండగా ఇద్దరిపై సీన్ లు తెరకెక్కనున్నాయని తెలుస్తోంది.  దేవిశ్రీ ప్రసాద్ సమకూరుస్తున్న సంగీతం ఇప్పటికే మూడు ట్యూన్స్ సిద్ధమయ్యాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం చేస్తోంది. 2023 సంక్రాంతి రేసులో చిరంజీవి 154 చిత్రం వుంటుంది.