Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకే వేదిక‌పై ప్ర‌ధాని మోడీ, మెగాస్టార్ చిరంజీవి

Modi- letter-chiru
, మంగళవారం, 28 జూన్ 2022 (18:19 IST)
Modi- letter-chiru
మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌ధాని మోదీ ఒకే వేదిక‌పై క‌నిపించ‌నున్నారు. గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి బి.జె.పి.లో జేర‌నున్నాడ‌నే టాక్ కూడా నెల‌కొంది. అప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్ర‌ధాని మోడీని క‌ల‌వ‌డం ఆయ‌న బిజెపికి అనుకూలంగా రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం జ‌రిగింది. ఇప్పుడు చిరంజీవికి టూరిజం మంత్రిత్వ‌శాఖ నుంచి జి.కిష‌న్‌రెడ్డి పేరుమీద ఓ లెట‌ర్ వ‌చ్చింది. ఆ లెట‌ర్‌లో మోదీగారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌స్తున్నారు. ఆయ‌న‌తోపాటు మీకూ ఆహ్వానం అంటూ పేర్కొన్నారు. 

 
విష‌యం ఏమంటే, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా, గొప్ప విప్లవకారులలో ఒకరైన స్వాతంత్ర‌ సమరయోధులలో ఒకరైన 'మన్యం వీరుడు' అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా  ఆయన విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవిని భారత ప్రభుత్వం ఆహ్వానించింది. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ. నరేంద్ర మోదీజీ, జూలై 4, 22న ఏపీలోని భీమవరంకి రానున్నారు. 27వ తేదీన రాసిన లెట‌ర్ సారాంశాన్ని చిరంజీవి కార్యాల‌యం తెలియ‌జేసింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త‌క్కువ ధరకే టిక్కెట్ - ఇప్పట్లో పక్కా కమర్షియల్ ఓటిటిలో రాదు- బన్నీ వాసు, మారుతి